Rahul Gandhi : ఈ దేశానికి వ్యవసాయ రంగం అత్యంత కీలకమని స్పష్టం చేశారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ. ఆయన ఎక్కడికి వెళ్లినా రైతులను కలుస్తున్నారు. కూలీలతో మాట్లాడుతున్నారు. వారి అనుభవాలను తెలుసుకుంటున్నారు. కూలీ ఎంత దొరుకుతుందని, పంటకు ఎంత ఖర్చు అవుతుందని అడుగుతున్నారు. స్వయంగా తానే పొలాల్లోకి దిగి, పనులు చేయడం విశేషం. ఇటీవల హర్యానాలోకి వెళ్లిన సందర్బంగా కూలీలు, రైతులతో సంభాషించారు. ఇందుకు సంబంధించిన వీడియోను , ఫోటోలను కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది. భారీ ఎత్తున ఆదరణ లభిస్తోంది.
ఈ సదర్బంగా గతంలో సాగు చట్టాలను తీసుకు వచ్చిన కేంద్ర సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఆయన రైతుల పక్షం అని ప్రకటించారు. ఇందుకు సంబంధించి విపక్షాలతో కలిసి ఆందోళన కూడా చేపట్టారు. రైతులపై దాడులను కూడా నిరసించారు. పార్లమెంట్ సాక్షిగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. సాగు చట్టాలు రైతుల పాలిట శాపంగా మారబోతున్నాయంటూ మండిపడ్డారు. మోదీని హెచ్చరించారు.
చివరకు రైతుల అలుపెరుగని పోరాటానికి దిగి రాక తప్పలేదు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. రైతులు లేక పోతే దేశం లేదని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.
Also Read : Daggubati Purandeswari : జగన్ సర్కార్ పై పురందేశ్వరి గరం
