Pawan Kalyan : ఎస్పీని క‌ల‌వ‌నున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్

తిరుప‌తి టూర్ పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌

Pawan Kalyan : జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ జోష్ పెంచారు. త‌మ పార్టీ(Janasena)కి చెందిన కార్య‌క‌ర్త‌పై బ‌హిరంగంగా సీఐ అంజూ యాద‌వ్ దాడి చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఆ మేర‌కు ఆయ‌న జ‌గ‌న్ స‌ర్కార్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌ణుకు బ‌హిరంగ స‌భ వేదిక‌గా స‌వాల్ విసిరారు. సోమ‌వారం ప్ర‌త్యేకించి తిరుప‌తి ఎస్పీ ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డిని క‌ల‌వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సీఐ నిర్వాకంపై మండిప‌డ్డారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలా అని ప్ర‌శ్నించారు. తాను ఊరుకోనంటూ హెచ్చ‌రించారు.

తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి ప‌ట్ట‌ణ సీఐ వ్య‌వ‌హారం రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ఇది ప్ర‌భుత్వానికి త‌ల‌వంపులు తెచ్చేలా చేసింది. ప్ర‌తిప‌క్షాల‌కు ఒక అవ‌కాశంగా మారింది. ఇంత జ‌రిగినా ఎందుక‌ని ఏపీ స‌ర్కార్ చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదంటూ ప్ర‌శ్నించారు. తానే స్వ‌యంగా తిరుప‌తికి వెళ‌తానంటూ ప్ర‌క‌టించారు. దీంతో ఏం జ‌రుగుతుందోన‌న్న ఉత్కంఠ నెల‌కొంది.

తిరుప‌తికి వెళ్లి హంగామా చేయ‌క ముందే సీఐపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌పై రాష్ట్ర డీజీపీ ఎస్పీతో ఆరా తీశార‌ని, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌శ్నించే లోపే సీఐపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు టాక్. మొత్తంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ దూకుడుకు అడ్డుక‌ట్ట ప‌డుతుందా అన్న‌ది వేచి చూడాలి.

Also Read : Rahul Gandhi : వ్య‌వ‌సాయం దేశానికి అవ‌స‌రం

Leave A Reply

Your Email Id will not be published!