RS Praveen Kumar : బీఆర్ఎస్ లో కమీషన్లు..కబ్జాలు – ఆర్ఎస్పీ
అధికార పార్టీలో అవినీతి అక్రమాల పర్వం
RS Praveen Kumar : బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వంలో కబ్జాలు, కమీషన్లు, సెటిల్మెంట్లు, దందాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆరోపించారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కంచర్ల కేశవరావు (కేకే) తనయులు ఇద్దరు ప్రవాస భారతీయురాలికి చెందిన బంజార్ హిల్స్ లోని విలువైన స్థలాన్ని కబ్జా చేశారంటూ కేసు నమోదు కావడం దారుణమన్నారు.
ఇది బీఆర్ఎస్ నేతల భూకబ్జాలు ఏ తీరుగా ఉన్నాయో తెలుస్తుందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS praveen Kumar). అంతే కాదు ఇదే పార్టీకి చెందిన ఓ మోస్తరు నాయకురాలు ఏకంగా రూ.30 కోట్ల విలువైన జాగాను కైవసం చేసుకుందంటే వీళ్ల అక్రమ బాగోతాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని ఉన్నాయో విచారణ చేపడితే తెలుస్తుందన్నారు.
ఇకనైనా ప్రజలు మేలుకోవాలని, బీఆర్ఎస్ కు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. మరోసారి గనుక వీళ్లకు అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్నే కాదు యావత్ ప్రజలను దోచుకుంటారని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కోట్లాది రూపాయలు కబ్జాకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి జైలుకు పంపించాలని బీఎస్పీ చీఫ్ డిమాండ్ చేశారు.
Also Read : KTR Rahul Gandhi : రాహుల్ కు క్లబ్బులు..పబ్బులు తెలుసు
