Alla Nani : వాలంటీర్ల జోలికొస్తే త‌రిమి కొడ‌తారు

మాజీ మంత్రి ఆళ్ల నాని షాకింగ్ కామెంట్స్

Alla Nani : మాజీ మంత్రి ఆళ్ల నాని నిప్పులు చెరిగారు. వాలంటీర్ల జోలికి వ‌స్తే చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను త‌రిమి కొట్ట‌డం ఖాయ‌మ‌ని హెచ్చ‌రించారు. జ‌గ‌న్ రెడ్డిపై అవాకులు పేలితే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొంటార‌ని అన్నారు. ప్ర‌జ‌లు ఇప్ప‌టికే ఛీత్క‌రించుకుంటున్నార‌ని , అందుకే వాలంటీర్ల‌పై దాడికి దిగుతున్నారంటూ ఆరోపించారు ఆళ్ల నాని(Alla Nani). ఆదివారం మాజీ మంత్రి ఏలూరులో మీడియాతో మాట్లాడారు.

మ‌హిళ‌ల అక్ర‌మ ర‌వాణాకు వాలంటీర్ల‌కు ఉన్న సంబంధం ఏమిటో చెప్పాల‌ని నిల‌దీశారు. చంద్ర‌బాబు నాయుడు స్క్రిప్టు రాసి ఇస్తే ప‌వ‌న్ క‌ళ్యాణ్ దానిని చ‌దువుతున్నారంటూ ఎద్దేవా చేశారు. వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను కించ ప‌రిచేలా మాట్లాడ‌టం స‌రి కాద‌న్నారు. వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు ఆళ్ల నాని.

ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ ప‌థ‌కాల‌ను , కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్న ఘ‌న‌త త‌మ ప్ర‌భుత్వానిద‌ని పేర్కొన్నారు. గ‌తంలో టీడీపీ పాల‌న‌లో పార్టీ నేత‌ల‌కే ల‌బ్ది చేకూరేవి. కానీ వైసీపీ స‌ర్కార్ వ‌చ్చాక సీన్ మారింద‌న్నారు. కోట్లాది మంది పేద‌ల‌కు ల‌బ్ది చేకూరేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు ఆళ్ల నాని.

ఆనాడు జ‌గ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర సంద‌ర్భంగా ప్ర‌తి రూపాయిని టీడీపీ నేత‌లు దోచుకుంటున్నారంటూ ప్ర‌జ‌లు ఫిర్యాదు చేశార‌ని అందుకే వారి బాధ‌ను అర్థం చేసుకుని పేద‌ల‌కు మేలు చేకూర్చేలా చ‌ర్య‌లు తీసుకున్నార‌ని చెప్పారు. ఇవాళ వాలంటీర్లు రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తున్నార‌ని కొనియాడారు.

Also Read : Panchakarla Ramesh Babu : సైనికుడిలా ప‌ని చేస్తా – ర‌మేష్ బాబు

Leave A Reply

Your Email Id will not be published!