S Jai Shankar : ఆర్థిక సహకారం అభివృద్ధికి సోపానం
కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి ఎస్ జైశంకర్
S Jai Shankar : ఆయా దేశాల మధ్య ఆర్థిక సహకారం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్. ఆదివారం బ్యాంకాక్ లో జరిగిన 12వ మెకాంగ్ గంగా సహకార (ఎంజీసీ) సమావేశానికి లావో పీడీఆర్ ఎఫ్ఎం సాలెమ్ క్సే కొమ్మాసిత్ తో కలిసి అధ్యక్షత వహించారు.
భారత దేశం – మయన్మార్ – థాయ్ లాండ్ త్రైపాక్షిక రహదారి అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు సుబ్రమణ్యం జై శంకర్(S Jai Shankar). మూడు దేశాల మధ్య మోటారు వాహనాల ఒప్పందాన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు.
ఆర్థిక సహకారాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు ఎంజీసీ బిజినెస్ కౌన్సిల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. త్వరిత ప్రభావ ప్రాజెక్టులతో సహా అభివృద్ది భాగస్వామ్యానికి సంబంధించి కొత రంగాలను అన్వేషించామన్నారు.
వ్యవసాయం, సైన్స్ అండ్ టెక్నాలజీ , నీటి వనరుల నిర్వహణలో ఎక్సేంజీల పరిధిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు సుబ్రమణ్యం జై శంకర్. సంస్కృతి, పర్యాటకాన్ని ముందుకు తీసుకు వెళ్లాలని మూడు దేశాలు ఓ ఒప్పందానికి వచ్చాయని స్పష్టం చేశారు కేంద్ర విదేశాంగ మంత్రి.
Also Read : Alla Nani : వాలంటీర్ల జోలికొస్తే తరిమి కొడతారు
