DK Shiva Kumar : దేశ‌మంత‌టా క‌ర్ణాట‌క రిజ‌ల్ట్స్ రిపీట్

పీసీసీ చీఫ్ , డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్

DK Shiva Kumar : దేశ‌మంత‌టా కర్ఖాట‌కలో వ‌చ్చిన ఫ‌లితాలు రావ‌డం ఖాయ‌మ‌ని క‌ర్ణాట‌క పీసీసీ చీఫ్ , డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ స్ప‌ష్టం చేశారు. ఇవాళ , రేపు బెంగ‌ళూరు వేదిక‌గా విప‌క్షాల కూట‌మి మీటింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్భంగా అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు డీకే శివ‌కుమార్(DK Shiva Kumar). సోమ‌వారం మీడియాతో మాట్లాడారు. దేశంలో మోదీ నియంతృత్వ పాల‌న సాగుతోంద‌ని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఏక‌ప‌క్ష పాల‌న‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌తి ఒక్క‌రు కృషి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

అందుకే త‌మ పార్టీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే సార‌థ్యంలో విప‌క్షాల కూట‌మి ఏర్పాటుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. ప్ర‌తిప‌క్షం అన్న‌ది బ‌లంగా లేక పోతే అధికార ప‌క్షం మ‌రింత రెచ్చిపోయే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్.

ఇప్ప‌టికే విప‌క్షాల కూట‌మి పాట్నా వేదిక‌గా తొలి స‌మావేశం పూర్త‌యింద‌ని, ఇది రెండో స‌మావేశమ‌ని స్ప‌ష్టం చేశారు. ఏఐసీసీ ఇప్ప‌టి వ‌ర‌కు 24 పార్టీల‌ను ఆహ్వానించింద‌ని, ఆప్ కూడా హాజ‌రు కానుంద‌ని వెల్ల‌డించారు. కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే ఛాన్స్ ఉంద‌న్నారు.

రాబోయే ఎన్నిక‌ల్లో విప‌క్షాల కూట‌మి అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని డీకే శివ‌కుమార్ జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. కులం, మ‌తం, విద్వేషం ప్రాతిప‌దిక‌న ఓట్లు ప‌డ‌వ‌న్నారు. ఇది క‌ర్ణాట‌క‌లో తేలి పోయింద‌న్నారు డిప్యూటీ సీఎం.

Also Read : Mallikarjun Kharge : బెదిరించ‌డం బీజేపీ నైజం – ఖర్గే

Leave A Reply

Your Email Id will not be published!