Tirumala Tickets : 18న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
21న కళ్యాణోత్సవం ..ఊంజల్ సేవ
Tirumala Tickets : శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీపి కబురు చెప్పింది. జూలై 18న మంగళవారం శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన కోటాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
వచ్చే అక్టోబర్ నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీ డిప్ కోసం మంగళవారం ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ప్రకటించింది. కాగా లక్కీ డిప్ లో టికెట్లు పొందిన భక్తులు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇక జూలై 21న ఉదయం 10 గంటలకు స్వామి , అమ్మ వార్లకు సంబంధించి కళ్యోణోత్సవం , ఆర్జిత బ్రహ్మోత్సవం , ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను విడుదల చేస్తామని తెలిపింది టీటీడీ. అక్టోబర్ నెల అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించి అనే వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని కోరింది టీటీడీ.
Also Read : Revanth Reddy : రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
