PM Modi Tribute : ఊమెన్ చాందీని కోల్పోవ‌డం బాధాక‌రం

గొప్ప స్నేహితుడు..నిరాడంబ‌ర‌మైన నేత

PM Modi Tribute : కేర‌ళ మాజీ సీఎం ఊమెన్ చాందీ మంగ‌ళవారం అనారోగ్యంతో క‌న్ను మూశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌నకు ప్ర‌ముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ వెంట‌నే స్పందించారు. ఆయ‌న‌తో త‌న‌కు ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు ఉన్న అతి కొద్ది మంది స్నేహితులు ఊమెన్ చాందీ కూడా ఒక‌ర‌ని పేర్కొన్నారు ప్ర‌ధానమంత్రి. త‌ను కేర‌ళ సీఎంగా ఉన్న స‌మ‌యంలో తాను గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్నాన‌ని తెలిపారు. తాను ప్ర‌ధాన‌మంత్రి అయ్యాక కూడా క‌లిశార‌ని వెల్ల‌డించారు న‌రేంద్ర మోదీ.

PM Modi Tribute Friend

ఇద్ద‌రం సీఎంలుగా ఉన్న స‌మ‌యంలో అనేక విష‌యాలు, అంశాల గురించి మాట్లాడుకున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఢిల్లీకి మారిన‌ప్పుడు కూడా త‌న‌ను వ‌చ్చి ప‌ల‌క‌రించార‌ని , తాను ఇవాళ గొప్ప ఆప్తుడిని, స్నేహితుడిని కోల్పోయాన‌ని బాధ‌ప‌డ్డారు న‌రేంద్ర మోదీ(PM Modi). వ్య‌క్తిగ‌తంగా త‌న‌కు లోటుగా పేర్కొన్నారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుతున్నాన‌ని స్ప‌ష్టం చేశారు.

సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడిగా ఊమెన్ చాందీ గుర్తింపు పొందారు. రాష్ట్ర రాజ‌కీయాల‌లో త‌న‌దైన ముద్ర క‌న‌బ‌ర్చారు. రెండుసార్లు కేర‌ళ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు. ఆయ‌న‌ను అన్ని వ‌ర్గాల వారు ఆద‌రించారు. 11 సార్లు ప్ర‌జా ప్ర‌తినిధిగా ఎన్నిక‌య్యారు. కేర‌ళ రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఇది ఓ రికార్డు.

Also Read : Sonia Rahul Pay Homage : ఊమెన్ చాందీకి సోనియా నివాళి

Leave A Reply

Your Email Id will not be published!