Sitaram Yechuri : దేశం ప్ర‌మాదంలో ఉంది – ఏచూరి

సీపీఐ నేత సీతారం షాకింగ్ కామెంట్స్

Sitaram Yechuri : ప్ర‌స్తుతం దేశం అత్యంత క్లిష్ట ద‌శ‌లో ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు సీపీఐ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి. మంగ‌ళ‌వారం ఆయ‌న బెంగ‌ళూరులో మీడియాతో మాట్లాడారు. విప‌క్షాల కూట‌మి కీల‌క స‌మావేశం జ‌రుగ‌తోంది. ఈ భేటీకి సీతారాం ఏచూరి(Sitaram Yechuri) హాజ‌రయ్యారు. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ కేవ‌లం మోదీ త‌ప్ప ఇంకేదీ దేశంలో క‌నిపించ‌డం లేదన్నారు. ఇది పూర్తిగా నియంతృత్వ ధోర‌ణితో కూడుకుని ఉన్న‌దే త‌ప్పా ఇది ప్ర‌జాస్వామ్యం అనిపించు కోద‌న్నారు.

Sitaram Yechuri Said

భార‌త రాజ్యాంగం మేర‌కు ప్ర‌జాస్యామ్యంలో ప్ర‌తి ఒక్క‌రికీ స్వేచ్ఛ అన్న‌ది ఉంటుంద‌న్నారు ఏచూరి. కానీ ఇవాళ డెమోక్ర‌సీ అన్న ప‌దానికి అర్థం లేకుండా పోతోంద‌ని మండిప‌డ్డారు. ఎప్పుడైతే ప్ర‌ధానిగా మోదీ కొలువు తీరారో ఆనాటి నుంచి దేశం పురోగ‌మ‌నంలోకి పోవాల్సి ఉండ‌గా తిరోగ‌మ‌నంలోకి వెళుతోంద‌న్నారు.

చివ‌ర‌కు రాజ్యాంగ‌మే వ‌ద్దు అనే ప‌రిస్థితికి వ‌చ్చింద‌న్నారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేసి కేవ‌లం ఒక్క వ్యాపార‌వేత్త‌లు, కార్పొరేట్ కంపెనీల‌ను మాత్ర‌మే వెన‌కేసుకు వ‌చ్చే దౌర్భాగ్య స్థితి ఈ దేశంలో దాపురించింద‌న్నారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు సీతారాం ఏచూరి.

Also Read : Arvind Kejriwal : మోదీ పాల‌న‌లో దేశం నాశ‌నం

Leave A Reply

Your Email Id will not be published!