Deepika Padukone Project K : క‌ళ్ల‌తో కాటేస్తున్న దీపికా

ప్రాజెక్టు తొలి టీజ‌ర్ అదుర్స్

Deepika Padukone Project K : ఇవాళ తెలుగు సినిమా రేంజ్ పెరిగి పోయింది. ఇక బ‌డ్జెట్ అనేది వంద‌ల కోట్ల‌ను దాటేసింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి తీసిన బాహుబ‌ళి, ఆర్ఆర్ఆర్. ఇక మ‌హాన‌టి సావిత్రి జీవిత క‌థ‌ను ఆధారంగా చేసుకుని నాగ్ అశ్విన్ తీసిన మ‌హాన‌టి చిత్రం ఊహించ‌ని రీతిలో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఎలాంటి క‌మ‌ర్షియ‌ల్ జిమ్మిక్కులు లేకుండా అద్భుతంగా తెర‌మీద కెక్కించ‌డంలో స‌క్సెస్ అయ్యాడు ద‌ర్శ‌కుడు. ఆ త‌ర్వాత జాతి ర‌త్నాల‌ను ప్ర‌మోట్ చేశాడు.

Deepika Padukone Project K Budget

త‌దుప‌రి ఊహించ‌ని భారీ బ‌డ్జెట్ తో ప్రాజెక్టు కె(Project K) పేరుతో సినిమా షూటింగ్ మొద‌లు పెట్టాడు. ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ల్లో దిగ్గ‌జ న‌టుల‌ను తీసుకున్నాడు. ఇది సైన్స్ , సోషియో ఫాంట‌సీ గా ఉంటుంద‌ని సినీ వ‌ర్గాల అంచ‌నా. ఇందులో పాన్ ఇండియా న‌టుడు డార్లింగ్ ప్ర‌భాస్ , బాలీవుడ్ క్వీన్ దీపికా ప‌దుకొనే తో పాటు క‌మ‌ల్ హాస‌న్ , అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టిస్తున్నారు.

దీంతో అంచ‌నాలు మ‌రింత పెరిగాయి ప్రాజెక్టు కె పై. ఇక మ‌రింత ఉత్కంఠ‌ను రేపుతూ మూవీ మేక‌ర్స్ పోస్ట‌ర్స్ , టీజ‌ర్స్ విడుద‌ల చేస్తున్నారు. మ‌రింత ఆస‌క్తిని పెంచుతున్నారు. తాజాగా దీపికా ప‌దుకొనే క‌ళ్ల‌పై ఫోక‌స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్ట‌ర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వైర‌ల్ అవుతోంది.

Also Read : Next CM Jr NTR : నెక్స్ట్ సీఎం జూనియ‌ర్ ఎన్టీఆర్

 

Leave A Reply

Your Email Id will not be published!