AP CM YS Jagan : వాలంటీర్లను దూషిస్తే ఒప్పుకోను
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
AP CM YS Jagan : ప్రతిపక్షాలు నిత్యం విశిష్ట సేవలు అందిస్తున్న వాలంటీర్లపై నోరు పారేసుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(AP CM YS Jagan). తనను ఎన్ని మాటలు అన్నా ఇప్పటి వరకు మౌనంగా ఉన్నానని పేర్కొన్నారు. కానీ గత కొంతకాలంగా పనిగట్టుకుని సేవలందిస్తున్న వాలంటీర్లను టార్గెట్ చేయడం తాను తట్టుకోలేనని స్పష్టం చేశారు ఏపీ సీఎం.
AP CM YS Jagan Said
ప్రజలకు అన్ని రకాల సేవలు అందించేందుకు వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని వల్ల అత్యధికంగా మేలు జరుగుతోంది ప్రజలకు. కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నానా రకాలుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసేలా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్ రెడ్డి.
తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వచ్చినా తాను భరిస్తూ వచ్చానని కానీ ఇక నుంచి వాలంటీర్లపై ఈగ వాలినా సహించ బోనంటూ వార్నింగ్ ఇచ్చారు బాబు, పవన్ కు. గతంలో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన వాళ్లే తిరిగి సేవలు అందిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం జగన్ రెడ్డి.
వాలంటీర్లే కాదు ప్రతి పేద వాడికి అండగా ఉంటానని స్పష్టం చేశారు. పేదలకు సేవ చేయలేని వాళ్లే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు.
Also read : Jitta Balakrishna Reddy : బీజేపీ నేత జిట్టా భూ కబ్జా