Harish Rao : కిరణ్..బాబు శిష్యులు కిషన్..రేవంత్
రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్ రావు
Harish Rao : తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీ చీఫ్ గంగాపురం కిషన్ రెడ్డిని, టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. శనివారం హరీశ్ రావు కిషన్ రెడ్డిని, రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు.
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి శిష్యుడిగా కిషన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు హరీష్ రావు(Harish Rao). ఇదే సమయంలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శిష్యుడిగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర మంత్రి.
Harish Rao Said
ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వను , ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ శాసనసభ సాక్షిగా ప్రకటించిన కిరణ్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టుకున్న కిషన్ రెడ్డి సిగ్గుతో తలవంచు కోవాలన్నారు హరీష్ రావు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఎలా కిరణ్ కుమార్ రెడ్డిని పిలుస్తారంటూ నిలదీశారు రాష్ట్ర మంత్రి. ఇక రాష్ట్రాన్ని వల్లకాడుగా మార్చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడిదన్నారు. ఆయన వల్లనే తెలంగాణ అన్ని రంగాలలో సర్వ నాశనం అయ్యిందని వాపోయారు.
అలాంటి చంద్రబాబుకు శిష్యుడిగా మారి పోయాడంటూ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని అంటూ ఆరోపించారు.
Also Read : Vallab Reddy Case : లహరిని వల్లబ్ రెడ్డి చంపేశాడు
