CM KCR : రైతు రుణ మాఫీ పునః ప్రారంభించాలి

ఆర్థిక శాఖ మంత్రిని ఆదేశించిన కేసీఆర్

CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో రైతుల‌కు తీపి క‌బురు చెప్పారు. గ‌తంలో ఇచ్చిన హామీ మేర‌కు కొంత మేర‌కే రైతులు తీసుకున్న రుణాల‌ను మాఫీ చేశారు. క‌రోనా కార‌ణంగా ఆర్థిక శాఖ‌పై భారం ప‌డ‌డం వ‌ల్ల ఇబ్బంది ఏర్ప‌డడంతో దానిని నిలిపి వేశారు. తాజాగా ఆగ‌స్టు 3న గురువారం నుంచి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి.

CM KCR Orders

ఈ త‌రుణంలో కేసీఆర్(KCR) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు రైతు రుణ మాఫీ కార్య‌క్ర‌మాన్ని పునః ప్రారంభిచాల‌ని ఆదేశించారు. ఎన్ని క‌ష్టాలు, న‌ష్టాలు వ‌చ్చినా ఇచ్చిన మాట కోసం క‌ట్టుబ‌డి ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.

బుధ‌వారం ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో రైతు రుణ మాఫీపై సుదీర్ఘ స‌మీక్ష చేప‌ట్టారు కేసీఆర్. రైతుల‌కు అందించాల్సిన రైతు బంధు, రైతు బీమా , ఉచిత విద్యుత్ , సాగునీరు వంటి ప‌థ‌కాల‌ను రాష్ట్ర స‌ర్కార్ చిత్త శుద్దితో కొన‌సాగిస్తున్న‌ద‌ని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని అందుకే రుణ మాఫీ పూర్తి చేయాల‌ని ఆదేశించారు కేసీఆర్.

అయితే వ్య‌వ‌సాయానికి సంబంధించి కార్యాచ‌ర‌ణ‌ను విస్మ‌రించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు కేసీఆర్. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. రైతులు సాధికార‌త సాధించేంత వ‌ర‌కు తాను నిద్ర పోన‌ని అన్నారు సీఎం. 3వ తేదీ నుంచి రుణ మాఫీ పునః ప్రారంభించాల‌న్నారు.

Also Read : Zinda Banda Song : షారుక్ జిందా బందా సాంగ్ రికార్డ్

Leave A Reply

Your Email Id will not be published!