Buggana Rajendranath Reddy : ఏపీ అప్పు రూ.4 ,42,442 కోట్లు
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
Buggana Rajendranath Reddy : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి వివరాలు లేవంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గున రాజేంద్ర నాథ్ రెడ్డి(Buggana Rajendranath Reddy). ఇప్పటి దాకా తమ సర్కార్ చేసిన అప్పులు రూ. 1,77,991 కోట్లు మాత్రమేని పేర్కొన్నారు. మొత్తం అప్పు రూ. 4,42,442 కోట్లు అని స్పష్టం చేశారు.
Buggana Rajendranath Reddy Confirmation
కార్పొరేషన్ రుణాలతో కాంపౌండ్ వార్షిక వృద్ది రేటు కలిపితే టీడీపీది 33 శాతంగా ఉంటే వైసీపీది 25 శాతంమేనని పేర్కొన్నారు బుగ్గన. పబ్లిక్ అకౌంట్ లో టీడీపీ సర్కార్ తీసుకుంది రూ. 36 వేల 241 కోట్లు అని తాము కేవలం రూ. 3,475 కోట్లు మాత్రమే తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రానికి మేలు జరగ కూడదనే ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపించారు. టీడీపీ హయాంలో రాబడి 6 శాతంగా ఉంటే జగన్ హయాంలో అది 16.7 శాతంగా ఉందన్నారు.
అప్పుల్లో ముంచిన చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తానంటే ఎవరు నమ్ముతారంటూ బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ఆరోపించారు. తాను సింహాన్ని అనుకుంటే పొరపాటు పడినట్లేనని ప్రజలు ఆ విషయం చెప్పాలన్నారు. అసత్య ప్రచారంతో ప్రజలను నమ్మించాలని చూడాలని అనుకోవడం మంచి పద్దతి కాదన్నారు బుగ్గన.
Also Read : CM KCR : రూ. 100 కోట్ల ధర పలకడం అభివృద్దికి చిహ్నం
