Dk Shiva kumar : బొంబట్ ఆతిథ్యం డీకే సంతోషం
నటుడి భోజన కార్యక్రమం అదుర్స్
Dk Shiva kumar : కర్ణాటక డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ వైరల్ గా మారారు. ఆయన ఇప్పుడు రాష్ట్రంలో మోస్ట్ పాపులర్ లీడర్ గా గుర్తింపు పొందారు. అంతే కాదు ఇటీవల ఏడీఆర్ సంస్థ ప్రకటించిన దేశంలోనే అత్యంత ధనవంతుల ఎమ్మెల్యేల జాబితాలో నెంబర్ వన్ గా నిలిచారు. అందరినీ విస్తు పోయేలా చేశారు.
Dk Shiva kumar Said
ప్రస్తుతం పవర్ ను ఎంజాయ్ చేస్తున్న డీకేకు(DK Shiva Kumar) ట్రబుల్ షూటర్ అని పేరు కూడా ఉంది. ఆయన జైలుకు కూడా వెళ్లి వచ్చారు. కానీ మొక్కవోని ఆత్మ విశ్వాసంతో ముందుకు నడిచారు. కేంద్రంలోని మోదీ సర్కార్ ను, దర్యాప్తు సంస్థలను తట్టుకుని నిలబడ్డారు.
ఇదిలా ఉండగా డీకే శివకుమార్ మంచి భోజన ప్రియుడు. అంతే కాదు ఆయనకు అన్ని రంగాల వారితో సత్ సంబంధాలు ఉన్నాయి. అన్ని పార్టీలకు చెందిన నేతలు కూడా తనతో టచ్ లో ఉంటారు. ఈ తరుణంలో శనివారం అరుదైన ఫోటోలను డీకే శివకుమార్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
కన్నడ సినీ రంగంలో పేరు పొందిన నటుడు శిహి కహి చంద్రు బొంబట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు డీకే. ఆయన స్వయంగా వండి భోజనాన్ని, కేక్ , ఇతర స్వీట్లను అందుబాటులో ఉంచారు . పాక శాస్త్ర నిపుణుడు (చెఫ్) గా పేరు పొందారు బొంబట్. నటుడు తనకు చిరకాల మిత్రుడంటూ కితాబు ఇచ్చారు డీకే. ప్రస్తుతం డీకే షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.
Also Read : CM Siddaramaiah : గృహ జ్యోతి పథకానికి శ్రీకారం