Sonia Rahul : క‌రుణానిధికి రాహుల్..సోనియా నివాళి

ఆగ‌స్టు 7న దివంగ‌త సీఎం వ‌ర్దంతి

Sonia Rahul : త‌మిళ‌నాడు మాజీ సీఎం , దివంగ‌త ఎం. క‌రుణానిధి వ‌ర్దంతి ఇవాళ‌. ఆగ‌స్టు 7న అరుదైన నాయ‌కుడు కాలం చేశారు. ఈ సంద‌ర్బంగా పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో డీఎంకే ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ఎం. క‌రుణానిధి(M Karunanidhi) చిత్ర ప‌టానికి నివాళులు అర్పించారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ.

Sonia Rahul Pay Tributes

త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌లో చెర‌గ‌ని ముద్ర వేసిన అద్భుత‌మైన ప్ర‌జా నాయ‌కుడు ఎం. క‌రుణా నిధి అని కొనియాడారు రాహుల్, సోనియా గాంధీ. ఆయ‌న చేసిన సేవ‌లు ఎల్ల‌ప్ప‌టికీ నిలిచే ఉంటాయ‌ని అన్నారు. ఆయ‌న అనుస‌రించిన మార్గం ప్ర‌తి ఒక్క‌రికీ ఆద‌ర్శ ప్రాయంగా నిలుస్తుంద‌న్నారు. డీఎంకే పార్టీ చీఫ్ గా పేద‌లు, అణ‌గారిన వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం ఎన‌లేని కృషి చేశారని కొనియాడారు.

భార‌త దేశ రాజ‌కీయాల‌లో ఎన్న‌ద‌గిన నాయ‌కుల‌లో ఎం. క‌రుణానిధి ఒక‌ర‌ని పేర్కొన్నారు. చివ‌రి వ‌ర‌కు ప్ర‌జ‌ల కోసం ప‌రిత‌పించిన వ్య‌క్తి, అరుదైన నాయ‌కుడు ఆయ‌న అని ప్ర‌శంసించారు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ. ఇవాళ డీఎంకే ఆధ్వ‌ర్యంలో త‌మిళ‌నాడులో ఏర్పాటైన స‌ర్కార్ ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను తీర్చ‌డంలో కీల‌క‌మైన పాత్ర పోషిస్తోంద‌న్నారు.

Also Read : NV Ramana Gaddar : గ‌ద్ద‌ర్ కు వంద‌నం – ఎన్వీ ర‌మ‌ణ

Leave A Reply

Your Email Id will not be published!