Manipur Violence : మణిపూర్ హింసకు మోదీదే బాధ్యత
కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణ
Manipur Violence : మణిపూర్ లో చోటు చేసుకున్న హింసకు పూర్తి బాధ్యత వహించాల్సింది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనేనని పేర్కొంది కాంగ్రెస్(Congress) పార్టీ. సోమవారం ట్విట్టర్ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కూడిన ఫోటోను షేర్ చేసింది. ఇప్పటి వరకు మణిపూర్ లో హింస, అల్లర్లు పూర్తయి 3 నెలలు అవుతోందని పేర్కొంది. ఈ హింసాత్మక ఘటనల్లో 160 మంది ప్రాణాలు కోల్పోయారని , కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించిన దాఖలాలు లేవన్నారు.
Manipur Violence – Modi Should be Responsible
300 మందికి పైగా గాయపడ్డారని, 50 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారని, 10 వేల మందికి పైగా ఆర్మీ , సైనిక బలగాలు మోహరించినా నేటికీ కంట్రోల్ కాలేదని వాపోయింది. కేంద్రంలో, రాష్ట్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ఏం చేస్తోందని ప్రశ్నించింది. ఓ వైపు మణిపూర్ మండి పోతుంటే ప్రధాన మంత్రి మోదీ మాత్రం విదేశీ పర్యటనలు చేశారంటూ ఆరోపించింది.
దీనికి ప్రధానంగా సమాధానం చెప్పాల్సింది మోదీ తప్ప మరొకరు కాదన్నారు. వెంటనే లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయలేక పోయిన మణిపూర్ సీఎం బీరేన్ , కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
Also Read : Sonia Rahul : కరుణానిధికి రాహుల్..సోనియా నివాళి
