Akbaruddin Owaisi : తెలంగాణను చూసి నేర్చుకోవాలి
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ
Akbaruddin Owaisi : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం శాసనసభలో తెలంగాణ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ఇతర రాష్ట్రాలలో హిందూ, ముస్లిం గొడవలతో రగిలి పోతుంటే ఒక్క తెలంగాణలో మాత్రం సంక్షేమ ప్రభుత్వం నడుస్తోందన్నారు. యావత్ భారత దేశం తెలంగాణ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాల్సింది ఉందన్నారు. హిందూ , ముస్లిం గొడవలు జరగకుండా బీఆర్ఎస్ బాటలో నడవాలని పిలుపునిచ్చారు.
Akbaruddin Owaisi Words About Telangana Govt
ఇప్పటికే ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తోంది బయటి నుంచి. మరో వైపు బీఆర్ఎస్ కు ఎంఐఎం బీ టీం అన్న విమర్శలు ఉన్నాయి. వాటిని కొట్టి పారేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేగా పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రశ్నలు సంధించారు.
పలు మార్లు, అవకాశం వచ్చిన ప్రతిసారీ ప్రభుత్వాన్ని, సీఎంను, మంత్రులను నిలదీశారు ఎమ్మెల్యే. ఇదిలా ఉండగా అక్బరుద్దీన్(Akbaruddin Owaisi) శాసన సభలో చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏది ఏమైనా పార్టీలకు అతీతంగా రాష్ట్ర సర్కార్ చేపట్టిన కార్యక్రమాలను చూడాలని సూచించారు.
ఏ ప్రభుత్వమైనా సాధించిన ప్రగతిని ఆధారంగా అంచనా వేస్తారన్నారు ఓవైసీ. అయితే బీజేపీ కొలువు తీరాక కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషాల దాడులు, అల్లర్లు మొదలయ్యాయని ఆరోపించారు.
Also Read : Kodali Nani Pawan : బాబుకు మద్దతిస్తే బడితె పూజ