Siddique Ismail : ఏమిటో సినీ రంగానికి చెందిన వాళ్లు ఒక్కరొక్కరు వెళ్లి పోతున్నారు. అద్బుతమైన ప్రతిభ కలిగిన దర్శకులలో ఒకడిగా పేరు పొందిన సిద్దిఖ్ ఇస్మాయిల్ కన్నుమూశారు. ఆయన ఎన్నో విజయవంతమైన సినిమాలను తీశారు. ఆగస్టు 1, 1960లో కేరళ లోని కొచ్చిలో పుట్టారు. ఆగస్టు 8, 2023లో గుండె పోటుతో కన్ను మూశారు. ఆయన మృతి యావత్ సినీ రంగానికి తీరని లోటుగా పేర్కొన్నారు పలువురు సినీ ప్రముఖులు. సిద్దిఖ్ ఇస్మాయిల్(Siddique Ismail) దర్శకుడు మాత్రమే కాదు స్క్రీన్ రైటర్ , యాక్టర్ , ప్రొడ్యూసర్ కూడా.
Siddique Ismail Is No More
మలయాళ చిత్రసీమ గొప్ప కళాకారుడిని కోల్పోవడం బాధాకరం. 1989లో రాంజీ రావు స్పీకింగ్ అనే మలయాళ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. స్క్రీన్ రైటర్ గా పప్పన్ ప్రియప్పెట్ట పప్పన్ 1986లో పని చేశాడు. ఆయన చివరి చిత్రం బిగ్ బ్రదర్.
ఫాజిల్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు సిద్దిఖ్ ఇస్మాయిల్. సిద్దిక్ , లాల్ ల ద్వయం కొచ్చిన్ కళా భవన్ లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఇద్దరూ కలిసి అనేక చిత్రాలను రూపొందించారు. ఆయన సినిమాలు ఎక్కువగా తమిళంలో రీమేక్ గా వచ్చాయి. సక్సెస్ సాధించాయి. మలయాళంలో ఆయన తీసిన బాడీ గార్డ్ ను హిందీలోకి రీమేక్ చేశారు. ఇది భారీ విజయాన్ని సాధించింది. సిద్దిక్ ఇస్మాయిల్ కు ఎన్నో అవార్డులు, పురస్కారాలు దక్కాయి.
Also Read : Rajinikanth : పని చేసుకుంటూ పోవడమే జీవితం
