Tirumala Rush : కలియుగ దైవంగా భావించే తిరుమల పుణ్య క్షేత్రానికి భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. మొన్న ఒక్క రోజు మాత్రం కాస్తంత తగ్గినట్లు అనిపించినా బుధవారం ఒక్క రోజు ఆ సంఖ్య మరింత పెరిగింది. నిన్న ఒక్క రోజు ఏకంగా 75 వేల 594 మంది భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. స్వామి వారికి తలనీలాలు సమర్పించుకునే భక్తుల సంఖ్య 26 వేల 213కు చేరింది. ఇక భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4 .60 కోట్లు వచ్చాయని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది.
Tirumala Rush with Huge People
స్వామి వారి దర్శనం కోసం తిరుమల లోని 16 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తెలిపింది. ఇక ఎలాంటి టోకెన్లు లేకుండా స్వామి, అమ్మ వార్లను దర్శించుకునే వారికి కనీసం 15 గంటల సమయం పట్టనుందని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా ఆగస్టు 10న గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ఇప్పటికే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. గతంలో దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో టీటీడీ చైర్మన్ గా పని చేశారు. ఇది రెండోసారి అవకాశం రావడం.
Also Read : Dasoju Sravan : కేంద్రం కాళేశ్వరంపై అబద్దం
