Pawan Kalyan Driver : గ్రీన్ ట్యాక్స్ పై డ్రైవ‌ర‌న్న ఆవేద‌న

జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ తో మొర

Pawan Kalyan Driver : దేశంలో ఎక్కడా లేని విధంగా ట్యాక్సుల రూపంలో ఏపీ స‌ర్కార్ నిట్ట నిలువునా ముంచుతోంద‌ని ఓ డ్రైవ‌ర్ ఆవేద‌న చెందాడు. మూడవ విడ‌త వారాహి విజ‌య యాత్ర సంద‌ర్భంగా శ‌నివ‌రం పెందుర్ది నియోజ‌క‌వ‌ర్గంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ర్య‌టించారు. త‌మిళ‌నాడులో రూ. 200 ఉంటే ఏపీలో మాత్రం గ్రీన్ ట్యాక్స్ కు రూ. 6,600 వ‌సూలు చేస్తున్నార‌ని వాపోయారు.

Pawan Kalyan Driver Interaction

దీనిపై త‌మ త‌ర‌పున ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల‌ని కోరారు డ్రైవ‌ర‌న్న‌. ఆయ‌న చెప్పిన విష‌యాన్ని సావ‌ధానంగా విన్నారు ప‌వ‌న్ కళ్యాణ్(Pawan Kalyan). తాను క‌చ్చితంగా ఈ పాయింట్ ను లేవ‌దీస్తాన‌ని, స‌ర్కార్ ను, ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేస్తానంటూ హామీ ఇచ్చారు. ప్ర‌స్తుతం డ్రైవ‌ర్ హైలెట్ గా మారారు.

అంత‌కు ముందు విశాఖ బీచ్ రోడ్డు నుంచి సుజాత‌న‌గ‌ర్ వ‌ర‌కు అడుగడుగునా జ‌న‌సేన శ్రేణులు, ప్ర‌జ‌లు సాద‌ర స్వ‌గ‌తం ప‌లికారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు. స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు సామాన్యులు. త‌న దృష్టికి వ‌చ్చిన ప్ర‌తి స‌మ‌స్య‌పై తాను గ‌ళం విప్పుతానంటూ హామీ ఇచ్చారు జ‌న‌సేనాని.

దేశంలో ఏపీ అన్న‌ది ఒక‌టి ఉందా అన్న అనుమానం త‌న‌కు క‌లుగుతోంద‌న్నారు ప‌వ‌న్ కళ్యాణ్. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలాగా ఉంటే ఇక్క‌డ ఎందుకు ఎక్కువ గ్రీన్ ట్యాక్స్ వ‌సూలు చేస్తున్నారంటూ నిల‌దీశారు .

Also Read : Pawan Kalyan : నేరాల అడ్గాగా మారిన విశాఖ – ప‌వ‌న్

Leave A Reply

Your Email Id will not be published!