YS Sharmila : స‌ర్కార్ భూములు దొర ప‌రం – ష‌ర్మిల‌

భూ బ‌కాసురుడు కేసీఆర్

YS Sharmila : ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే అతి పెద్ద భూ బ‌కాసురుడు ఎవ‌రైనా ఉన్నారంటే అత‌డు ఎవ‌రో కాదు బీఆర్ఎస్ చీఫ్‌, తెలంగాణ సీఎం కేసీఆర్ అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌(YS Sharmila). గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. ఎవ‌రూ అడిగేటోళ్లు లేర‌ని స‌ర్కారీ భూముల‌పై క‌న్నేశాడ‌ని, కోట్లాది రూపాయ‌ల విలువ చేసే వాటిని ఆగ‌మాగం ప‌ట్టించాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

YS Sharmila Slams KCR

దొర హ‌వా న‌డుస్తోంద‌ని, త‌న ఇష్టానుసారం కేట‌యించుకుంటూ పోతున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. కావాల్సింది కాజేయ‌డం, ఆదాయం అని ఉన్న‌ది అమ్మేయ‌డం ఇదే చేస్తూ వ‌చ్చార‌ని మండిప‌డ్డారు. ఆయ‌న పాల‌న చేయ‌డం లేద‌ని భూ దందా వ్యాపారం చేస్తున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు వైఎస్ ష‌ర్మిల‌.

ఆయా జిల్లాల్లో పార్టీ ఆఫీసుల పేరుతో రూ. 1000 కోట్లు విలువ చేసే 33.72 ఎక‌రాల భూముల‌ను రూ. 3 కోట్ల‌కే అప్ప‌నంగా కొట్టేశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఎక‌రం రూ. 100 కోట్లు ప‌లికే కోకాపేట‌లో దొర గారి భార‌తీయ భ‌వ‌న్ కోసం రూ. 3.41 కోట్ల‌కే ధారాద‌త్తం ఎలా చేశారంటూ ప్ర‌శ్నించారు వైఎస్ ష‌ర్మిల‌.

హైకోర్టు చీవాట్లు పెట్టినా, జ‌నం కోప్ప‌డినా ప‌ట్టించుకోకుండా ఎందుకు మౌనంగా ఉన్నారంటూ సీఎంను ప్ర‌శ్నించారు.

Also Read : TDP Slams TTD : టీటీడీ నిర్ణ‌యం టీడీపీ ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!