Pawan Kalyan : ప‌వ‌న్ భ‌రోసా కార్మికుడికి ఆస‌రా

పారిశుద్ధ్య కార్మికుడికి ఆర్థిక సాయం

Pawan Kalyan : జ‌నసేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బిజీగా ఉన్నారు. మూడో విడ‌త వారాహి విజ‌య యాత్ర కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్బంగా ఏపీ స‌ర్కార్ ను ఏకి పారేశారు. మ‌రో వైపు త‌న ఉదార‌త‌ను చాటుకున్నారు. వారాహి యాత్ర సంద‌ర్బంగా త‌న మీద ఉన్న అభిమానంతో పారిశుధ్య కార్మికుడు 37వ డివిజ‌న్ లో త‌న గురించి ప్ర‌చారం చేశాడు. దీనిని గ‌మ‌నించిన జీవీఎంసీ ల‌క్ష్మ‌ణ రావును విధుల నుంచి తొల‌గించింది.

Pawan Kalyan Supports GVMC Lakshmana Rao

వెంట‌నే విష‌యం తెలుసుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ విశాఖ జ‌న‌వాణి కార్య‌క్ర‌మంలో పారిశుద్ధ్య కార్మికుడికి రూ. 50 వేలు ఆర్థిక సాయం అంద‌జేశారు. మ‌రో ఉద్యోగం ఇప్పిస్తాన‌ని హామీ ఇచ్చారు. ఇవాళ జ‌న‌వాణి కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల నుంచి విన‌తులు వ‌చ్చాయి. వారంద‌రికీ పేరు పేరునా అభినందిస్తూనే స‌మ‌స్య‌ల‌ను నోట్ చేసుకున్నారు. తాను త‌ల వంచే వాడిని కాద‌న్నారు.

ప్ర‌భుత్వం నిద్ర పోతోంద‌ని దానిని మేల్కొల్పేందుకే తాను ఈ యాత్ర చేప‌ట్టాన‌న్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan). ఓ వైపు జ‌నం స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతుంటే జ‌గ‌న్ కు ఎలా నిద్ర ప‌డుతుంద‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల‌ను మాయ మాట‌ల‌తో మ‌భ్య పెట్టి, సంక్షేమ ప‌థ‌కాల పేరుతో బురిడీ కొట్టించాల‌ని అనుకోవ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. రాబోయే రోజుల్లో జ‌గ‌న్ కు గుణ‌పాఠం త‌ప్ప‌ద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా త‌న‌కు ఆర్థిక సాయం చేసినందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు పారిశుధ్య కార్మికుడు ల‌క్ష్మ‌ణ్ రావు.

Also Read : YS Sharmila : స‌ర్కార్ భూములు దొర ప‌రం – ష‌ర్మిల‌

Leave A Reply

Your Email Id will not be published!