Devineni Uma : నాని..వంశీపై రెచ్చి పోయిన ఉమ
రాజకీయ సమాధి తప్పదని వార్నింగ్
Devineni Uma : మాజీ మంత్రి దేవినేని ఉమ రెచ్చి పోయారు. ఆయన మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై నిప్పులు చెరిగారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో దేవినేని ఉమ షాకింగ్ కామెంట్స్ చేశారు.
Devineni Uma Slams Kodali Nani and Vamsi
కొడాలి నాని, వంశీలను ఏకి పారేశారు. రాబోయే ఎన్నికల్లో మీ ఇద్దరిని ప్రజలు ఛీత్కరించడం ఖాయమన్నారు. మీ అందరికీ రాజకీయ సమాధి కడతానని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు దేవినేని ఉమ. రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చారని ఆరోపించారు.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడం ఖాయమని జోష్యం చెప్పారు. అందుకు గన్నవరం సాక్షిగా హాజరైన ప్రజలే సాక్ష్యమని పేర్కొన్నారు దేవినేని ఉమ(Devineni Uma). సంక్షేమ పథకాల పేరుతో మోసం చేసిన ఘనత సీఎం జగన్ రెడ్డికి దక్కుతుందన్నారు.
జగన్ రెడ్డి అండ చూసుకుని రెచ్చి పోతున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి కుక్కలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నా. కాచుకోండి వచ్చేది మేమేనని హెచ్చరించారు. ఇంకోసారి తమ నాయకుడిని గనుక ఏమైనా అంటే ఊరుకునే ప్రసక్తి లేదని అన్నారు దేవినేని ఉమ.
Also Read : Nara Lokesh : వైసీపీ సన్నాసులకు షాకింగ్ ఇస్తా
