Balka Suman : కాంగ్రెస్ లోకి కోవర్ట్ లను పంపాం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్
Balka Suman : కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు చెన్నూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman). తాము కావాలని కొందరు నాయకులను కోవర్టులను ఆ పార్టీలోకి పంపించామని అన్నారు. ఆ పార్టీలో ఉన్నది తమ వాళ్లేనని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ వాళ్లు కనిపిస్తే ఏమీ అనకండి అని అన్నారు బాల్క సుమన్. వాళ్లు మనోళ్లే. మనమే కొందరిని పంపించామని అన్నారు. ఎన్నికలు అయ్యాక మళ్లీ మన పార్టీలోకి వస్తారని చెప్పారు. ఇప్పటికే తీవ్ర విమర్శలు ఉన్నాయి.
Balka Suman Comments on Congress
గతంలో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ కండువా కప్పుకున్నారు. మరికొందరు మాత్రమే ఉన్నారు. మరో వైపు బీజేపీ మాజీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు.
కాంగ్రెస్ పార్టీకి సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం చేస్తున్నాడంటూ ఆరోపించారు. 30 మంది ఎమ్మెల్యేలకు నేరుగా డబ్బులు ఇస్తున్నాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ పార్టీ నుంచి ఎవరు ఎమ్మెల్యేలుగా గెలిచినా వాళ్లంతా బీఆర్ఎస్ లో చేరడం ఖాయమని జోష్యం చెప్పారు.
ఈ తరుణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోవర్టులను పంపించామనడం కలకలం రేపింది.
Also Read : Justice K Chandru Comment : జై భీమ్ జస్టిస్ చంద్రు