Muttireddy Yadagiri Reddy : ‘పల్లా’ జనగాంతో నీకేం సంబంధం
నిప్పులు చెరిగిన ముత్తిరెడ్డి యాదిగిరి రెడ్డి
Muttireddy Yadagiri Reddy : తెలంగాణలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీలో అంతర్గత పోరు మొదలైంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా జనగాంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి(Muttireddy Yadagiri Reddy) మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ తరుణంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.
Muttireddy Yadagiri Reddy Slams MLA Rajeswar Reddy
పల్లా రాజేశ్వర్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. నీకు జనగాం నియోజకవర్గంతో ఏం సంబంధం ఉందంటూ నిలదీశారు. నీ స్వంత అక్కను మోసం చేసిన నీచుడివి నువ్వు అంటూ మండిపడ్డారు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.
ఆమెకు చెందిన ఇంజనీరింగ్ కాలేజీలను అక్రమంగా కొనుగోలు చేసిన పల్లాకు తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. మానసికంగా తీవ్ర వేదనకు గురి చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
జనగామ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులను డబ్బులతో కొనుగోలు చేస్తూ పార్టీని మలినం చేస్తున్నారని.. జనగామ ప్రజలతో సంబందం లేని వ్యక్తివి, నీవు ఎలా సేవా చేస్తావో చెప్పాలని నిలదీశారు. తాను భూ కబ్జాకు పాల్పడినట్లు నిరూపిస్తే ప్రాణ త్యాగానికైనా సిద్దంగా ఉన్నానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఛాలెంజ్ చేశారు. మొత్తంగా బీఆర్ఎస్ బాస్ ఎన్నికల అభ్యర్థుల జాబితా ప్రకటించిన నాటి నుంచి విభేదాలు భగ్గుమన్నాయి.
Also Read : BRS MLAs Comment : ఎమ్మెల్యేలు గులాబీ ముళ్లు
