Tirumala Rush : పుణ్య క్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ యధావిధిగా కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 68 వేల 263 మంది భక్తులు దర్శించుకున్నారు. 28 వేల 355 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది.
Tirumala Rush With Huge People
భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.65 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. ఇక స్వామి వారి దర్శనం కోసం తిరుమల లోని 25 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
ఎలాంటి టోకెన్లు లేకుండా శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు సంబంధించి 18 గంటలకు పైగా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను వసతి సౌకర్యాలను, సకల ఏర్పాట్లను చేసినట్లు టీటీడీ(TTD) కార్యనిర్వహణ అధికారి ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు.
కాలి నడకన శ్రీవారి మెట్లు, అలిపిరి మెట్ల నుంచి వచ్చే భక్తులకు పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేసినట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. అటవీ శాఖ సూచనల మేరకు చేతి కర్రలను కూడా ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read : Bhatti Vikramarka : కాంగ్రెస్ పథకాలు బీఆర్ఎస్ కాపీ
