PM Modi Congrats : ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల కృషి భేష్ – మోదీ

శాస్త్రీయ ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతాయి

PM Modi Congrats : శ్రీ‌హ‌రి కోట లోని షార్ వేదిక‌గా శ‌నివారం ప్ర‌యోగించిన ఆదిత్య‌-ఎల్1 ఉపగ్ర‌హం నింగిలోకి విజ‌య‌వంతంగా దూసుకు వెళ్లింది. ఇప్ప‌టికే చంద్ర‌యాన్ -3తో చంద్రుడి వ‌ద్ద‌కు చేరింది. ఈ ప్ర‌య‌త్నంతో ప్ర‌పంచంలోనే అగ్ర దేశాల స‌ర‌స‌న భార‌త దేశం చేరుకుంది.

తాజాగా ప్ర‌యోగించిన రాకెట్ కూడా స‌క్సెస్ కావ‌డంతో సంతోషాన్ని వ్య‌క్తం చేశారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. ఈ సంద‌ర్భంగా ఇస్రో సైంటిస్టుల‌ను, ఇంజ‌నీర్ల‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. శాస్త్రీయ ప్ర‌య‌త్నాలు మున్ముందు కూడా కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు న‌రేంద్ర మోదీ.

PM Modi Congrats to ISRO

భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ శాస్త్ర‌వేత్త‌లు సాధించిన కృషి గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొన్నారు ప్ర‌ధాన మంత్రి(PM Modi Congrats). విశ్వాన్ని అర్థం చేసుకునేందుకు ఇలాంటివి మున్ముందు ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు.

చంద్ర‌యాన్ -3 స‌క్సెస్ త‌ర్వాత భార‌త్ త‌న అంతరిక్ష యాత్ర‌ను కంటిన్యూగా కొన‌సాగిస్తుంద‌న్న న‌మ్మ‌కం తన‌కు ఉంద‌ని పేర్కొన్నారు.

ఇస్రో శనివారం దేశం యొక్క ప్రతిష్టాత్మక సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్ 1 ను ప్రారంభించింది, కొన్ని రోజుల క్రితం చంద్రయాన్ 3 విజయవంతమైన చంద్ర యాత్ర తర్వాత చరిత్రను మళ్లీ చూసింది.

నాలుగు నెలల ప్రయాణంలో సూర్యుని వెలుపలి పొరలను పరిశీలించడానికి ఈ మిషన్ శాస్త్రీయ పరికరాలను తీసుకువెళుతోంది. శ్రీ‌హ‌రి కోట స్పేస్ పోర్ట్ నుండి ఉద‌యం 11.50 గంట‌ల‌కు అంత‌రిక్షంలోకి దూసుకు వెళ్లింది. మ‌న దేశం నుంచి మొట్ట మొద‌టి సోలార్ మిష‌న్ కావ‌డం గ‌మ‌నార్హం.

Also Read : MLC Kavitha : రేవంత్ రెడ్డిపై క‌విత గుస్సా

Leave A Reply

Your Email Id will not be published!