Tirumala Rush : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లు

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ

Tirumala Rush : తిరుమ‌ల – కోట్లాది మంది భ‌క్తుల కొంగు బంగారంగా వినుతి కెక్కిన శ్రీ‌నివాసుడు, అలివేలు మంగ‌మ్మ‌లు కొలువైన ప్ర‌సిద్ధ పుణ్య క్షేత్రం తిరుమ‌ల భ‌క్తుల నామ స్మ‌ర‌ణ‌తో హోరెత్తుతోంది. రోజు రోజుకు భ‌క్తుల ర‌ద్దీ పెరుగుతూనే ఉంది త‌ప్ప ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు.

Tirumala Rush with Devotees

భారీ ఎత్తున సుదూర ప్రాంతాల నుండి, విదేశాల నుండి సైతం స్వామి వారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (TTD). భ‌క్తుల సౌక‌ర్యార్థం అద‌న‌పు గ‌దుల‌ను నిర్మించింది.

భారీ ఎత్తున విద్యుత్ తో న‌డిచే బ‌స్సుల‌ను ప్రారంభించింది. తాజాగా నిన్న శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని 66 వేల 590 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. స్వామి వారిని 31 వేల 52 మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకున్నారు.

ఇక నిత్యం ఆ దేవ దేవుడికి స‌మ‌ర్పించుకునే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లు వ‌చ్చింద‌ని టీటీడీ ఈవో ఏవో ధ‌ర్మా రెడ్డి వెల్ల‌డించారు. శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం 9 అపార్ట్ మెంట్ల‌లో వేచి ఉన్నారు.

ఎలాంటి టోకెన్లు లేకుండా వేచి ఉన్న భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి సుమారు 10 గంట‌ల‌కు పైగా ప‌ట్ట‌నుంద‌ని టీటీడీ చైర్మ‌న్ తెలిపారు.

Also Read : India Comment : మీడియా పక్షపాతం ఇండియా ఉక్కుపాదం

Leave A Reply

Your Email Id will not be published!