Ambati Rambabu : బావ వద్ద బాలయ్య మీసాలు తిప్పాలి
ఏపీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్
Ambati Rambabu : మరోసారి బాలయ్య మీసం తిప్పడంపై సీరియస్ కామెంట్స్ చేశారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. శుక్రవారం ఆయన మీడియాతోమాట్లాడారు. బాలకృష్ణ తన బావ చంద్రబాబు వద్ద మీసాలు తిప్పితే బాగుంటుందని సూచించారు. ముందు మీ పార్టీలో మీసాలు తిప్పాలంటూ ఎద్దేవా చేశారు.
Ambati Rambabu Comments on Balakrishna
మీ తండ్రి ఎన్టీఆర్ వెన్నులో దించిన కత్తి పట్టుకుని కదలాలని స్పష్టం చేశారు. బావ జైల్లో అల్లుడు ఢిల్లీలో ఉన్నాడంటూ ఎద్దేవా చేశారు. పార్టీ పగ్గాలు చేపడితే బెటర్ అని పేర్కొన్నారు అంబటి రాంబాబు(Ambati Rambabu). నారా చంద్రబాబు నాయుడు నిప్పు అని మీకు అనిపిస్తే, ఒకవేళ దమ్ముంటే తమ వద్దకు చర్చకు రావాలని సవాల్ విసిరారు.
తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించినా ఎందుకని టీడీపీ ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కావాల్సింది చర్చ కాదని రచ్చ చేయడమేనని ఆరోపించారు. చంద్రబాబు నాయుడుకు సామాన్యుడికి సంబంధించి చట్టం ఒక్కటేనని గుర్తుంచు కోవాలన్నారు మంత్రి అంబటి రాంబాబు.
మీసాలు తిప్పడం వల్ల ఉపయోగం ఏమీ లేదన్నారు. తండ్రికి క్లిష్ట సమయంలో మీరు పట్టించు కోలేదన్న అపవాదు ఉందన్నారు. ఇప్పుడు దానిని తుడిచి వేసేందుకు మంచి ఛాన్స్ దక్కిందన్నారు ఏపీ మంత్రి.
Also Read : Womens Reservation Bill : బిల్లుకు ఆమోదం మోదీకి వందనం