Vijay Sai Reddy : చంద్ర‌బాబుకు జైలే గ‌తి

ఎంపీ విజ‌య సాయి రెడ్డి

Vijay Sai Reddy : ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్కిల్ డైవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ స్కాంలో అడ్డంగా బుక్కై రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో జైలు ఊచ‌లు లెక్క బెడుతున్న టీడీపీ చీప్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై నిప్పులు చెరిగారు వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి(Vijay Sai Reddy).

ఆనాడు అధికారం అడ్డం పెట్టుకుని అందినంత మేర దోచుకున్నాడ‌ని , త‌న ప‌రివారానికి దోచి పెట్టాడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న అరెస్ట్ వ‌ల్ల రాష్ట్రానికి తీవ్ర న‌ష్టం అన్న‌ట్లు టీడీపీ ప్ర‌జ‌ల‌కు చెప్పే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని పేర్కొన్నారు. కానీ ఎక్క‌డా చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు రాలేద‌న్నారు.

Vijay Sai Reddy Shocking Comments on Chandrababu

మోత మోగిద్దాం అనే పేరుతో చేప‌ట్టిన కార్య‌క్ర‌మం పూర్తిగా అట్ట‌ర్ ప్లాప్ అయ్యిందంటూ ఎద్దేవా చేశారు. సామాన్యుల‌కు డ‌బ్బులు ఎర‌గా చూపి బాబు కోసం మ‌ద్ద‌తుగా శిరో ముండ‌నం చేసుకోవాలంటూ చెప్ప‌డం చ‌ట్టం ప్ర‌కారం నేర‌మే అవుతుంద‌ని ఆ విష‌యం తెలుసుకుంటే మంచిద‌ని సూచించారు.

ఎన్ని జిమ్మిక్కులు చేసినా లేదా ఎన్ని వ్యూహాలు ప‌న్నినా చివ‌ర‌కు మిగిలేది శంక‌ర‌గిరి మాన్యాలు త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు. ఏదో ఒక రోజు నారా లోకేష్ కూడా అరెస్ట్ కావ‌డం ప‌క్కా అని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు ఎంపీ విజ‌య సాయి రెడ్డి.

Also Read : Minister KTR : మోదీ హామీల అమ‌లు జాడేది – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!