Meenakshi Lekhi : బీజేపీ వాలంటీర్లు జర్నలిస్టులు కావాలి
కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి
Meenakshi Lekhi : విజయవాడ – కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీకి చెందిన సోషల్ మీడియా వాలంటీర్లు ఇక నుంచి మీడియా, జర్నలిస్టులుగా తయారు కావాలని స్పష్టం చేశారు. బెజవాడలో జరిగిన ఏపీ రాష్ట్ర బీజేపీ సామాజిక మాధ్యమాల వాలంటీర్ల సమావేశంలో మీనాక్షి లేఖి పాల్గొని ప్రసంగించారు.
Meenakshi Lekhi Comment Viral
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర సర్కార్ గత తొమ్మిది సంవత్సరాలుగా చేసిన అభివృద్దిని ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు సోషల్ మీడియా మాధ్యమాన్ని వినియోగించు కోవాలని పిలుపునిచ్చారు.
బీజేపీ సమాచారం ప్రతి ఒక్కరికీ చేర వేసేందుకు ఇది అద్భుతమైన సాధనంగా పనికి వస్తుందని చెప్పారు మీనాక్షి లేఖి(Meenakshi Lekhi). అంతే కాకుండా పత్రికలను చదవాలని, ఛానళ్లను నిశితంగా పరిశీలించాలని సూచించారు కేంద్ర మంత్రి.
రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ మండల స్థాయిలో ఏ విధంగా పని చేయాలనే దానిపై శిక్షణ ఇచ్చారు. ఫేస్ బుక్ లో స్నేహితుల సంఖ్య పెంచుకోవాలని, పార్టీ విధానాలను వారికి పరిచంయ చేయాలని సూచించారు.
అంతకు ముందు పీఎం మోదీ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్దిపై డాక్యుమెంటరీని ప్రదర్శించారు.
Also Read : Palestine Pity : పాలస్తీనా అరణ్య రోదన
