Chandra Babu Naidu : చంద్ర‌బాబు బెయిల్ పై ఉత్కంఠ

టీడీపీ చీఫ్ ఇక జైలుకే ప‌రిమిత‌మేనా

Chandra Babu Naidu : రాజ‌మండ్రి – సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. సోమ‌వారం కీల‌క‌మైన తీర్పు వెలువ‌డ‌నుంది. ఆయ‌న‌కు బెయిల్ వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం టీడీపీ శ్రేణుల‌కు క‌ల‌గ‌డం లేదు.

Chandra Babu Naidu Case Viral

ఏపీ స్కిల్ స్కాం కేసులో తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు టీడీపీ చీఫ్‌. ఏపీ సీఐడీ కేసు న‌మోదు చేసింది. ఇందుకు సంబంధించి విజ‌య‌వాడ లోని ఏసీబీ కోర్టులో హాజ‌రు ప‌ర్చ‌డంతో కోర్టు జ‌డ్జి హిమ బిందు సంచ‌ల‌న తీర్పు చెప్పారు. చంద్ర‌బాబు నాయుడుకు(Chandra Babu Naidu) బిగ్ షాక్ ఇచ్చారు. అక్టోబ‌ర్ 19 వ‌ర‌కు రిమాండ్ విధించారు.

ఏపీ స్కిల్ స్కాంతో పాటు ఫైబ‌ర్ నెట్ స్కాం, అమ‌రావ‌తి రింగ్ రోడ్డు ఎన్ లైన్మెంట్ స్కాంలో కేసులు న‌మోదు చేసింది. దీనిని స‌వాల్ చేస్తూ చంద్ర‌బాబు నాయుడు త‌ర‌పున న్యాయ‌వాదులు సిద్దార్థ్ లూత్రా, దూబే వాద‌న‌లు వినిపించారు.

ఇక ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున ఏఏజీ పొన్న‌వోలు సుధాక‌ర్ రెడ్డి వాదించారు. ఇదిలా ఉండ‌గా చంద్ర‌బాబు నాయుడు జైలుకు వెళ్లి ఇవాల్టితో 31 రోజులు గ‌డిచాయి. గ‌త నెల 9వ తేదీన అరెస్ట్ అయ్యారు. ఇవాళ చంద్ర‌బాబుతో కుటుంబీకులు ములాఖ‌త్ కానున్నారు.

Also Read : Tirumala Rush : తిరుమ‌ల‌లో భక్తుల ర‌ద్దీ

Leave A Reply

Your Email Id will not be published!