YS Sharmila : కాంగ్రెస్ రిక్త హ‌స్తం పోటీకి సిద్దం

ష‌ర్మిల పార్టీ విలీనానికి బ్రేక్

YS Sharmila : హైద‌రాబాద్ – తెలంగాణ‌లో శాస‌న స‌భ ఎన్నిక‌ల న‌గారా మోగింది. ఇక నిన్న‌టి దాకా కాంగ్రెస్ పార్టీతో దోస్తీ ఉంటుంద‌ని అనుకున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలకు ఉన్న‌ట్టుండి దోస్తానాకు బ్రేక్ ప‌డింది. ఇప్ప‌టికే ప‌లుమార్లు ఢిల్లీకి వ‌చ్చారు ష‌ర్మిల‌. ఈ సంద‌ర్భంగా ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, మాజీ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీల‌తో భేటీ అయ్యారు.

YS Sharmila Comment

ఈ చ‌ర్చ‌ల సంద‌ర్భంగా ష‌ర్మిల చేసిన ప్రతిపాద‌న‌ల‌కు ఓకే చెప్పింది. అయితే త‌న‌కు కోరిన చోట టికెట్ కావాల‌ని కోరింది. దీనిపై పార్టీలో ఇప్ప‌టికే ఆశావ‌హులు ఎక్కువ‌గా ఉండ‌డం, గ‌త కొన్నేళ్ల నుంచి పార్టీని న‌మ్ముకుని బ‌రిలో ఉండాల‌ని అనుకున్న వాళ్లకు ఇబ్బంది ఏర్ప‌డుతుంద‌ని గ్ర‌హించిన పార్టీ కొంత ఆల‌స్యం చేసింది.

దీంతో త‌న పార్టీని విలీనం చేయాల‌న్న ప్ర‌తిపాద‌న‌కు తాత్కాలికంగా బ్రేక్ ప‌డింది. దీంతో ఇప్ప‌టికే పాద‌యాత్ర‌తో ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌రైన వైఎస్ ష‌ర్మిల(YS Sharmila) ఉన్న‌ట్టుండి యూ ట‌ర్న్ తీసుకోక త‌ప్ప‌లేదు. ఇక ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.

ఇక ఇదే పార్టీలో కీల‌కంగా ఉన్న ఇందిరా శోభ‌న్ తో పాటు ప్ర‌ముఖ ప్ర‌జా గాయ‌కుడు పార్టీని వీడారు.

Also Read : AP High Court Shock : హైకోర్టులో బాబుకు చుక్కెదురు

Leave A Reply

Your Email Id will not be published!