Telangana Election : వృద్దులు..దివ్యాంగులకు తీపి కబురు
ఇంటి వద్ద నుండే ఓటు హక్కు
Telangana Election : తెలంగాణ – కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కీలక ప్రకటన చేసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. తెలంగాణతో పాటు మిజోరం, మధ్య ప్రదేశ్ , రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో ఎన్నికల తేదీలు ప్రకటించారు. జనవరి నెలాఖరులోగా శాసనసభ ఎన్నికలు ముగుస్తాయని పేర్కొంది.
Telangana Election Updates
ఇక తెలంగాణలో నవంబర్ 3న ప్రభుత్వ గెజిట్ ప్రకటిస్తామని తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తుల ఉపసంహరణకు నవంబర్ 13న ఆఖరు తేదీ నిర్ణయించామన్నారు సీఈసీ(CEC). నవంబర్ 30న రాష్ట్రంలో పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. డిసెంబర్ 3న ఆయా పోలింగ్ కు సంబంధించి రిజల్ట్స్ ప్రకటిస్తామన్నారు.
రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. వారిలో వందేళ్లు దాటిన వారు 7,689 మంది, 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 4.43 లక్షల మంది ఉన్నారని తెలిపారు సీఈసీ.
దివ్యాంగులు 5.06 లక్షలు, తొలిసారి ఓటు హక్కు పొందిన వారు 8.11 లక్షల మంది ఉన్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,356 పోలింగ్
Also Read : Telangana Election 2023 : తెలంగాణలో 35,356 పోలింగ్ స్టేషన్లు