Congress Protest : చెన్నూరు టికెట్ సీపీఐకి వద్దు
రాహుల్ గాంధీకి నిరసన సెగ
Congress Protest : కరీంనగర్ – ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్న ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీకి తన స్వంత పార్టీ నుంచే నిరసన వ్యక్తం కావడంతో ఖంగుతిన్నారు. రాష్ట్రంలో పార్టీకి రోజు రోజుకు బలం పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయి. ఈ తరుణంలో మొత్తం 119 సీట్లకు గాను 55 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేస్తూ తొలి జాబితాను ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్.
Congress Protest Viral
ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా శుక్రవారం కరీంనగర్ లో బస చేస్తున్న హోటల్ వద్దకు చెన్నూరు నియోజకవర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. పెద్ద ఎత్తున టీపీసీసీ చీఫ్ కు , హైకమాండ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు.
సేవ్ కాంగ్రెస్(Congress) సేవ్ చెన్నూరు అంటూ ప్ల కార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. పొత్తులో భాగంగా చెన్నూరు టికెట్ సీపీఐకి కేటాయించ వద్దని కోరారు. ఇదిలా ఉండగా పార్టీ పరంగా టికెట్ ఆశిస్తున్న నల్లాల ఓదెలు, రాజా రమేష్, నూకల రమేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక్కడ ఆ పార్టీకి గనుక టికెట్ కేటాయిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. వీలైతే ఎన్నికల రంగంలో ఇండిపెండెట్లు గా పోటీ చేస్తామని ప్రకటించారు టికెట్లు ఆశిస్తున్న వారు.
Also Read : Gone Prakash Rao : బలహీన వర్గాలపై కాంగ్రెస్ వివక్ష
