Chandra Babu Case : చంద్రబాబుకు సుప్రీం బిగ్ షాక్
బెయిల్ పిటిషన్ 8కి వాయిదా
Chandra Babu Case : న్యూఢిల్లీ – ఏపీ టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ఏపీ సీఐడీ దాఖలు చేసిన ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి ఏపీ ఏసీబీ కోర్టు విచారించింది.
Chandra Babu Case Again Posponed
నవంబర్ 1 వరకు రిమాండ్ పొడిగిస్తూ తీర్పు చెప్పింది. ఇదే సమయంలో చంద్రబాబు(Chandra Babu) హైకోర్టును ఆశ్రయించారు. దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టి వేసింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.
ఇదే సమయంలో ఏపీ స్కిల్ స్కాంతో పాటు ఫైబర్ నెట్ , అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో కూడా ప్రధాన పాత్ర పోషించారంటూ చంద్రబాబు నాయుడిపై మరికొన్ని కేసులు నమోదు చేసింది ఏపీ సీఐడీ.
దీని నుంచి తనకు ముందస్తు బెయిల్ కావాలని కోరుతూ మరోసారి చంద్రబాబు నాయుడు తరపున లాయర్లు పిటిషన్లు దాఖలు చేశారు. ఇక్కడ కూడా నిరాశే ఎదురైంది. సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై తదుపరి విచారణను నవంబర్ 8 కి వాయిదా వేసింది. దీంతో మరోసారి షాక్ తగిలింది బాబుకు.
Also Read : Ambarpet Shankar : గులాబీ గూటికి అంబర్ పేట శంకర్
