Minister KTR : హత్యా రాజకీయాలు మంచిది కాదు
ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్
Minister KTR : హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యా యత్నం జరిగింది. ఈ ఘటనలో ఆయనకు రక్త స్రావం కావడంతో హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. ఆపరేషన్ చేశారు. నాలుగు గంటల పాటు చికిత్స అందించారు. ప్రస్తుతం ఎంపీ ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రకటించారు.
Minister KTR Visited Yashoda Hospital
విషయం తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్ ఆస్పత్రికి విచ్చేశారు. ఆయన తో పాటు తనయుడు, ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR), బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చెరుకు సుధాకర్ ఉన్నారు. దాడి గురించి ఆరా తీశారు. సురక్షితంగా బయట పడడం సంతోకరమైన విషయమన్నారు. మెరుగైన వైద్య చికిత్స అందజేస్తున్నామని ఈ సందర్బంగా సీఎంకు ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది.
ఇదిలా ఉండగా దాడికి గురైన సమయంలో ఎంపీ గన్ మెన్ చాకచక్యంగా ప్రభాకర్ రెడ్డిని తప్పించడంతో అతడి వేలుకు గాయమైంది. ఎంపీని కాపాడిన అంగ రక్షకుడిని ప్రత్యేకంగా సీఎం కేసీఆర్ అభినందించారు. పరామర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. హత్యా రాజకీయాలకు తెలంగాణలో చోటు లేదన్నారు.
ఏమైనా ప్రత్యక్షంగా రాజకీయంగా తేల్చుకోవాలే తప్పా భౌతిక దాడులకు దిగడం మంచిది కాదని సూచించారు.
Also Read : Raghunandan Rao : బీఆర్ఎస్ దుష్ప్రచారం దారుణం
