Chandrababu Naidu : బాబుకు మ‌ధ్యంత‌ర బెయిల్

స్కిల్ స్కామ్ కేసులో హైకోర్టు

Chandrababu Naidu : అమ‌రావ‌తి – ఏపీ స్కిల్ స్కాం కేసులో మాజీ సీఎం , టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడుకు ఊర‌ట ల‌భించింది. ఆయ‌న గ‌త 50 రోజుల‌కు పైగా రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఏపీ సీఐడీ ఆయ‌న‌పై రూ. 371 కోట్ల స్కాం కేసు న‌మోదు చేసింది. దీంతో పాటు మ‌రో రెండు కేసులు ఫైబ‌ర్ నెట్, అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డ ఎలైన్మెంట్ కేసు కూడా న‌మోద‌య్యాయి.

Chandrababu Naidu Got Temporary Bail

దీంతో మ‌ధ్యంత‌ర బెయిల్ కోసం నానా తంటాలు ప‌డ్డారు. అయినా హైకోర్టు ఒప్పుకోలేదు. క్వాష్ పిటిష‌న్ దాఖ‌లు చేసినా చంద్ర‌బాబుకు చుక్కెదురైంది. చివ‌ర‌కు త‌న‌యుడు నారా లోకేష్ , కిష‌న్ రెడ్డి, భువ‌నేశ్వ‌రితో క‌లిసి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో భేటీ అయ్యారు.

ఆరోజు నుంచి ఏదో ఒక రోజు చంద్ర‌బాబుకు(Chandrababu Naidu) బెయిల్ దొరుకుతుంద‌ని ఆశించారు. అంతా అనుకున్న‌ట్టే చంద్ర‌బాబుకు ఊర‌ట ల‌భించింద‌ని చెప్పక త‌ప్ప‌దు. మంగ‌ళ‌వారం మ‌రోసారి హైకోర్టులో చంద్ర‌బాబు కేసు విష‌యంపై విచార‌ణకు వ‌చ్చింది.

నిన్న‌నే కేసు విచార‌ణ చేప‌ట్టిన కోర్టు ఇవాళ తీర్పు వెలువ‌రించింది. నాలుగు వారాల పాటు మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. న్యాయ‌మూర్తి మ‌ల్లికార్జున్ రావు ఈ తీర్పు వెలువ‌రించారు. అనారోగ్య కార‌ణాల రీత్యా, కంటికి శ‌స్త్ర చికిత్స చేయాల్సి ఉంద‌ని పేర్కొన‌డంతో జ‌డ్జి ఊర‌ట‌నిచ్చారు.

Also Read : AFG vs SL ICC World Cup : సెమీస్ పై ఆఫ్గాన్ ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!