PM Modi : జ‌య‌హో భార‌త్ – మోదీ

అద్బుత విజ‌యంపై సంతోషం

PM Modi : న్యూఢిల్లీ – దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త క్రికెట్ జ‌ట్టు అద్భుతం చేసింద‌ని కొనియాడారు. ముంబై వేదిక‌గా జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచ్ ఆద్యంత‌మూ ఉత్కంఠ భ‌రితంగా సాగింద‌ని పేర్కొన్నారు. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో స‌మిష్టిగా రాణించార‌ని , దేశ ప్ర‌తిష్ట‌ను మ‌రింత పెంచేలా చేశార‌ని, ప్ర‌తి భార‌తీయుడు గ‌ర్వ ప‌డే విధంగా ఆడారంటూ కితాబు ఇచ్చారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌ధాన మంత్రి స్పందించారు.

PM Modi Wishes

ఆయ‌న ఆనందాన్ని పంచుకున్నారు . తాను కూడా ఉత్కంఠ‌తో మ్యాచ్ ను చూశాన‌ని, ఇరు జ‌ట్లు అస‌లైన క్రికెట్ ఆట అంటే ఏమిటో చూపించాయ‌ని పేర్కొన్నారు. భార‌త దేశం క్రీడా రంగంలో త‌న‌కు ఎదురే లేద‌ని చాటేందుకు ఒకే ఒక్క అడుగు దూరంలో టీమిండియా ఉంద‌ని తెలిపారు మోదీ.

ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ లో గెలుపొంది 140 కోట్ల భార‌తీయుల గుండెల‌న్నీ సంతోషంతో ఉప్పొంగి పోయేలా చేయాల‌ని ఆయన ఆకాంక్షించారు. ఇదిలా ఉండ‌గా భార‌త్ న్యూజిలాండ్ ను 70 ప‌రుగుల తేడాతో ఓడించింది. విరాట్ కోహ్లీ, శ్రేయ‌స్ అయ్య‌ర్, మ‌హ్మ‌ద్ ష‌మీ, రోహిత్ శ‌ర్మ‌, శుభ్ మ‌న్ గిల్ ల‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ప్ర‌త్యేకించి ష‌మీని ఆకాశానికి ఎత్తేశారు మోదీ.

Also Read : Minister KTR : రైతును రాజును చేసిన కేసీఆర్

Leave A Reply

Your Email Id will not be published!