Eatala Rajender : దొర‌ను దించితేనే తెలంగాణ‌కు విముక్తి

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కామెంట్

Eatala Rajender : సిద్దిపేట జిల్లా – నీళ్లు, నిధులు, నియామ‌కాల పేరుతో అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్ దొర పాల‌న సాగించాడ‌ని , అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను మోసం చేశాడ‌ని నిప్పులు చెరిగారు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్(Eatala Rajender). ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా గురువారం సిద్దిపేట జిల్లా గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలోని వ‌ర్గల్, న‌ర్సంప‌ల్లిలో పర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా భారీ ఎత్తున జ‌నం పోగ‌య్యారు. వారిని ఉద్దేశించి ప్ర‌సంగించారు రాజేంద‌ర్.

Eatala Rajender Comments on KCR

ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల‌పాలు చేశాడ‌ని, చివ‌ర‌కు తాగుబోతుల‌కు అడ్డ‌గా మార్చేసిన నీచ‌మైన వ్య‌క్తి సీఎం అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి వ్య‌క్తి సీఎంగా ఉండేందుకు అన‌ర్హుడ‌ని పేర్కొన్నారు ఈటెల రాజేంద‌ర్.

స‌మాజంలో కీల‌క పాత్ర పోషించాల్సిన యువ‌త నిర్వీర్యం అయ్యేలా గ‌డీ గ‌డీకి మ‌ద్యం షాపుల‌ను ఓపెన్ చేసిన చ‌రిత్ర ఈ క‌ల్వ‌కుంట్ల కాల‌కేయుల కుటుంబానిదంటూ మండిప‌డ్డారు. అంద‌రికీ ఇచ్చే క‌ళ్యాణ ల‌క్ష్మి, పెన్ష‌న్ వ‌న్నీ క‌లిపితే 25,000 అవుతాయ‌ని కానీ తాగుడు పేరుతో కేసీఆర్ గుంజుతున్న డ‌బ్బులు ఏకంగా రూ. 45,000 కోట్లు అని స్ప‌ష్టం చేశారు మాజీ మంత్రి, ప్ర‌స్తుత గ‌జ్వేల్ అభ్య‌ర్థి .

ఇక‌నైనా మీ విలువైన ఓటును పని చేసే వాళ్ల‌కు వేయాల‌ని కోరారు.

Also Read : Revanth Reddy : కేసీఆర్ కుటుంబాన్ని సాగ‌నంపాలి

Leave A Reply

Your Email Id will not be published!