Ponguleti Srinivas Reddy : కేసీఆర్ మోసం తెలంగాణ ఆగమాగం
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Ponguleti Srinivas Reddy : పాలేరు – మాజీ ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా మారారు. నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం మారింది. ప్రజలతో కలిసి పోతున్నారు. ఆయన ప్రధానంగా బీఆర్ఎస్ సర్కార్ ను, అమలు చేస్తున్న పథకాలను, సీఎం కేసీఆర్ ఒంటెద్దు పోకడను ప్రశ్నిస్తున్నారు. ఒక రకంగా దొర గడీల పాలనను నిలదీస్తున్నారు.
Ponguleti Srinivas Reddy Slams KCR
తనను కావాలని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. తన వల్ల తనకు లాభం కలుగ లేదన్నారు. కానీ నా వల్ల కేసీఆర్ కే మేలు జరిగిందని విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. తెలంగాణకు రెండు సార్లు సీఎం అయిన కేసీఆర్ రాష్ట్రానికి ఏం మేలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
తాను ఏం చేశారో చెప్పాలన్నారు. ముందు తెలంగాణ పేరుతో ఎంత దోచుకున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy). కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగు పడిందన్నారు . ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దె దించాలని లేక పోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Also Read : RS Praveen Kumar : ఆర్ఎస్పీని అరెస్ట్ చేయొద్దు
