Telangana Govt : హైదరాబాద్ – తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థలో సంచలనం కలిగించేలా కొత్త పథకం రాబోతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి పాలైంది. కొత్త సర్కార్ కొలువు తీరింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల మేరకు కీలక నిర్ణయం ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆర్టీసీ ఎండీని ఆదేశించారు. మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా బస్సు ప్రయాణం మహిళలకు కల్పించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ఆధ్వర్యంలో ఉచిత జర్నీకి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది.
Telangana Govt Announced
ఈ మేరకు ఎండీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 9న మధ్యాహ్నం మహాలక్ష్మి పథకాన్ని అమలు అవుతుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇవాళ ఈ పథకానికి సంబంధించి జీవో జారీ చేసింది. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుండి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా జర్నీ చేయొచ్చని తెలిపింది.
మహిళలు, ఆడ పిల్లలు, ట్రాన్స్ జెండర్లకు ఉచితంగా ప్రయాణం చేసేందుకు ఛాన్స్ ఉందన్నారు. ఇందులో ప్రయాణం చేసే వారికి ఎలాంటి వయసు నియమాలు ఏవీ లేవని పేర్కొంది కాంగ్రెస్(Congress) ప్రభుత్వం. అంతర్రాష్ట్ర సరిహద్దుల వరకు ప్రయాణం ఉచితంగా ఉంటుందని తెలిపింది. మొదటి వారం రోజులు ఎలాంటి ఐడీ కార్డులు లేకుండానే జర్నీ చేయొచ్చని తెలిపింది సర్కార్.
Also Read : CM Revanth Reddy : మహిళలకు రేవంత్ ఖుష్ కబర్
