Anil Kumar Yadav: క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో అనిల్‌ కుమార్‌ యాదవ్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో అనిల్‌ కుమార్‌ యాదవ్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Anil Kumar Yadav : క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు, రవాణా కేసులో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత, మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ (Anil Kumar Yadav) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో అనిల్‌ అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డిని ఏపీ పోలీసులు సోమవారం హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. విచారణలో శ్రీకాంత్‌రెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. ఇదే కేసులో మరో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అరెస్టయి రిమాండ్‌ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.

Anil Kumar Yadav Mining Case

‘‘అనిల్‌ కుమార్‌ యాదవ్‌, కాకాణి గోవర్ధన్‌రెడ్డితో నాకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. 2023 ఆగస్ట్‌ నుంచి అనిల్‌, కాకాణితో క్వార్ట్జ్‌ వ్యాపారం చేశాను. లీజు గడువు ముగిసినా రుస్తుం మైన్‌ నుంచి క్వార్ట్జ్‌ తీశాం. వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి క్వారీ పనులు చూసుకున్నారు. పర్యవేక్షించినందుకు నాకు టన్నుకు రూ.1000 ఇచ్చేవారు. క్వార్ట్జ్‌ను ఏనుగు శశిధర్‌రెడ్డి పొలంలో డంప్‌ చేసేవాళ్లం. ఆయనకు ఎకరాకు రూ.25వేలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాం.

రుస్తుం మైన్‌ నుంచి తీసిన క్వార్ట్జ్‌ను చైనాకు పంపాం. దువ్వారు శ్రీకాంత్‌ రెడ్డితో క్వార్ట్జ్‌ను ఎగుమతి చేయించేవాళ్లం. వచ్చిన డబ్బుతో స్థిరాస్తి వ్యాపారం చేశాం. నేను, అనిల్‌ కలిసి గూడూరులో 100 ఎకరాల్లో, నాయుడుపేట వద్ద 50 ఎకరాల్లో వెంచర్లు వేశాం. హైదరాబాద్‌లో రెండు హౌసింగ్‌ ప్రాజెక్టులు చేపట్టాం. మణికొండ అల్కాపురిలో హెవెన్లీ హోమ్స్‌, తుర్కయాంజల్‌లో గ్రీన్‌ మెడోస్‌ పేరిట వెంచర్లు వేశాం. 2024లో ప్రభుత్వం మారాక కేసులకు భయపడి నేను హైదరాబాద్‌కు మకాం మార్చాను’’అని శ్రీకాంత్‌రెడ్డి పోలీసులకు తెలిపినట్లు సమాచారం.

శ్రీకాంత్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

మాజీ మంత్రి అనిల్‌ అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. రుస్తుం మైన్స్‌ తవ్వకాల కేసులో నెల్లూరు రూరల్ పోలీసులు ఆయన్ను గూడూరు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం నెల్లూరు జైలుకు తరలించారు. ఈ కేసులో శ్రీకాంత్‌ ఏ12గా ఉన్నారు.

Also Read : Minister TG Bharath: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించిన మంత్రి టీజీ భరత్

Leave A Reply

Your Email Id will not be published!