Shubhanshu Shukla: ప్రధాని మోదీతో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా భేటీ

ప్రధాని మోదీతో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా భేటీ

Shubhanshu Shukla : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం యాత్రను పూర్తి చేసుకుని స్వదేశానికి చేరుకున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఐస్రో అస్ట్రోనాట్ జాకెట్ ధరించి వచ్చిన శుభాంశును మోదీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శుభాంశు తన రోదసి ప్రయాణ విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. ఈ సందర్భంగా శుభాంశు అంతరిక్ష యాత్ర విజయవంతంపై మోదీ ఆయన్ను అభినందించారు.

Shubhanshu Shukla Meet

‘‘శుభాంశు శుక్లాతో (Shubhanshu Shukla) సంభాషణ గొప్పగా సాగింది. అంతరిక్షంలో ఆయన అనుభవాలు, శాస్త్రసాంకేతిక రంగాల్లో పురోగతి, భారత్‌ కు చెందిన ప్రతిష్ఠాత్మక ‘గగన్‌యాన్’ మిషన్‌ సహా అనేక అంశాలపై చర్చించాం. రోదసిలో శుభాంశు సాధించిన ఘనత పట్ల యావత్‌ దేశం గర్విస్తోంది’’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

యాక్సియం-4 మిషన్‌లో భాగంగా జూన్‌ 25 నుంచి జులై 15 వరకు శుభాంశు శుక్లా తన బృందంతో కలిసి ‘ఐఎస్‌ఎస్‌’ యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. దీని కోసం శిక్షణ పొందుతూ ఏడాదిగా ఆయన అమెరికాలో ఉన్నారు. ఐఎస్ఎస్‌కు పర్యటించిన తొలి భారతీయ వ్యోమగామిగా ఆయన గుర్తింపు పొందారు. 18 రోజుల మిషన్ పూర్తి చేసుకుని జూలై 15న ఆయన తిరిగి భూమిపై కాలుపెట్టారు. ఆదివారంనాడు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఆయనకు ఘన స్వాగతం లభించింది. శుభాంశు కుటుంబ సభ్యులతో పాటు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఇస్రో చైర్మన్ వి.నారాయణ, పెద్ద సంఖ్యలో ప్రజలు సాదర స్వాగతం పలికారు. శుభాంశు అంతరిక్ష యాత్ర విజయవంతంపై లోక్‌సభలో ప్రత్యేకంగా చర్చించారు.

Also Read : YS Jagan: వైఎస్ జగన్‌ కు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఫోన్‌

Leave A Reply

Your Email Id will not be published!