ACB Court: ఎస్సై‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఏసీబీ కోర్టు సంచలన తీర్పు

ఎస్సై‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఏసీబీ కోర్టు సంచలన తీర్పు

ACB Court : లంచం తీసుకుంటూ ఏసీబీకు పట్టుబడిన ఎస్సైకు ఏడేళ్ళు జైలు శిక్ష విధిస్తూ…. ఏసీబీ కోర్టు (ACB Court) సంచలనం తీర్పు వెల్లడించింది. ముద్దాయిలను అరెస్టు చేయకుండా ఉండేందుకు లక్ష రూపాయలు లంచం తీసుకున్న సబ్-ఇన్‌స్పెక్టర్‌ ‌కు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు ఫిర్యాదు దారునికి 2.5 లక్షల రూపాయలను నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

ACB Court Key Verdict

విశాఖపట్నంలో నివసిస్తున్న ఓ మహిళ తన భర్త మంగరాజు, అతని తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లపై వరకట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. దీనితో కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్‌ లో 2015లో ఎస్సైగా పని చేస్తున్న పెద్దయ్యకు సదరు మహిళ ఫిర్యాదు చేశారు. దీనితో మంగరాజు, అతని కుటుంబ సభ్యులపై వరకట్నం నిషేధం చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ముద్దాయిలను అరెస్ట్ చేయకుండా ఎస్సై తాత్సారం చేశారు. అరెస్ట్ చేయకుండా ఉండేందుకు మంగరాజు నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు.

అయితే ఎస్సై పెద్దయ్యకు లంచం ఇవ్వడం ఇష్టం లేని మంగరాజు కుటుంబ సభ్యులు ఏసీబీను ఆశ్రయించారు. దీనితో రంగంలోనికి దిగిన ఏసీబీ అధికారులు… మంగరాజు నుంచి కానిస్టేబుల్ ద్వారా లంచం తీసుకుంటుండగా ఎస్సైను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ కేసును విచారించిన ఏసీబీ న్యాయస్థానం ఎస్సైకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా ఫిర్యాదుదారుడికి రూ.2.5 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని కూడా తీర్పునిచ్చింది.

Also Read : Janasena: విశాఖ వేదికగా ప్రాంరభమైన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు

Leave A Reply

Your Email Id will not be published!