Minister Nara Lokesh: కడప జిల్లాలో స్మార్ట్ కిచెన్‌ ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్‌

కడప జిల్లాలో స్మార్ట్ కిచెన్‌ ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్‌

Nara Lokesh : దేశంలోనే తొలిసారిగా కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం సికె దిన్నె ఎంపిపి పాఠశాల ఆవరణలో రూ.2 కోట్లతో ఏర్పాటుచేసిన సెంట్రలైజ్డ్ అడ్వాన్స్ డ్ స్మార్ట్ కిచెన్ ను మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రారంభించారు. కమలాపురం 2, జమ్మలమడుగు 2, కడపలో 1 స్మార్ట్ కిచెన్ ను వర్చువల్ గా ప్రారంభించారు. వీటి ద్వారా 136 పాఠశాలల్లోని 10,323 మందికి భోజనం అందించనున్నారు. పాఠశాలలకు తరలించడానికి ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. అనంతరం లోకేశ్‌ అధికారులతో కలిసి స్మార్ట్‌ కిచెన్‌ను సందర్శించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) మాట్లాడుతూ… తల్లిదండ్రుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని స్మార్ట్ కిచెన్లను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని అధికారులను కోరాను. స్మార్ట్ కిచెన్ పనితీరునుబట్టి రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తామని తెలిపాను. ఈ సందర్భంగా పదోతరగతి విద్యార్థినులతో భేటీ అయ్యాను. గత ఏడాది కాలంగా తాము చేపట్టిన సంస్కరణలు ఎలా ఉన్నాయని విద్యార్థులను వాకబు చేసి, వారి నుంచి సలహాలు స్వీకరించాను. డిసెంబర్ నాటికి జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో 33అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్ ప్రారంభిస్తాము.

Minister Nara Lokesh – సొంత పార్టీ కార్యకర్తలను కలిసేందుకు వీఐపీ పాసులా ? –  జగన్‌ తీరుపై లోకేశ్‌ సెటైర్లు

తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనలో వైసీపీ కార్యకర్తలకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వీఐపీ పాసులు జారీ చేయడంపై మంత్రి లోకేశ్‌ ఎక్స్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘‘ఓరి నీ పాసుగాల! సినిమా ఫంక్షన్లకు వీఐపీ పాసులు విన్నాం గానీ… సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి వీఐపీ పాసులు ఏందయ్యా? ఎప్పుడూ వినలే..! చూడలే..!’’ అంటూ జగన్‌ తీరును ఎండగట్టారు.

అసలేం జరిగిందంటే ?

ఇటీవల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జగన్‌ తన సొంత నియోజకవర్గం పులివెందులకు మొదటిసారి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలను కలవడానికి వీఐపీ పాసులు జారీ చేయించారు. ఈ పరిణామం పలువురిని విస్మయానికి గురిచేసింది. తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్‌ సోమవారం పులివెందుల వచ్చారు. కొందరు కార్యకర్తలను మాత్రమే మాజీ ముఖ్యమంత్రి కలుసుకున్నారు. పాసులున్న వ్యక్తులనే భద్రతా సిబ్బంది అనుమతించడం, గతంలో ఎన్నడూలేని విధంగా కొత్త పద్ధతిని ప్రవేశపెట్టడంపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కంగుతిన్నారు. భద్రతా సిబ్బందితో పలువురు వాగ్వాదానికి దిగారు.

Also Read : Sugali Preeti Case: సుగాలి ప్రీతి కేసులో ప్రభుత్వం సంచలన నిర్ణయం

Leave A Reply

Your Email Id will not be published!