చెన్నై : తమిళ చలన చిత్ర పరిశ్రమలో కీలకమైన నటుడిగా ఉన్నారు దళపతి విజయ్. తను ఎవరూ ఊహించని రీతిలో సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు రాజకీయాలలోకి వస్తున్నట్లు వెల్లడించాడు. ఆపై టీవీకే పేరుతో పార్టీ ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఈ ఏడాది 2026లో జరిగే శాసన సభ ఎన్నకలలో ఒంటరిగానే పాల్గొంటానని ప్రకటించాడు. అంతే కాదు తను సినిమా రంగం నుంచి నిష్క్రమిస్తున్నట్లు వెల్లడించాడు. తాను నటించిన జన నాయగన్ మూవీ ఆఖరి సినిమా అని స్పష్టం చేశాడు. దీంతో తాను పూర్తిగా సీరియస్ గా పాలిటిక్స్ లో ఉంటానని పేర్కొన్నాడు. తాజాగా జాతీయ ఛానల్ ఎన్డీటీవీతో చిట్ చాట్ చేశాడు దళపతి విజయ్. ఇదిలా ఉండగా జనవరి 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా జన నాయగన్ విడుదల కావాల్సి ఉంది. అయితే తమిళనాడుకు చెందిన సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టును, చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. భారీ బడ్జెట్ తో జన నాయగన్ ను నిర్మించారు నిర్మాత.
సినీ నిర్మాత పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశాడు దళపతి విజయ్. ఇదే సమయంలో బాలీవుడ్ టాప్ హీరో బాద్ షా షారుక్ ఖాన్ ను రోల్ మోడల్ అని ప్రశంసించాడు. బిగిల్ , మెర్సల్ స్టార్ తన రాజకీయ ప్రవేశం వల్ల సినిమాల నుండి శాశ్వత బహిష్కరణకు దారితీసిందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. జన నాయగన్ ఎదుర్కొంటున్న రాజకీయ ప్రేరేపిత సమస్యల గురించి విజయ్ తలపతి విజయ్ విచారం వ్యక్తం చేశారు. తన నిర్మాత పట్ల బాధగా ఉందని, ఎందుకంటే తన రాజకీయ ప్రవేశం కారణంగా ఆ ప్రాజెక్ట్ ఇబ్బందులు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత అడ్డంకులను ఊహించారు, వ్యక్తిగత ప్రభావాలకు మానసికంగా సిద్ధమయ్యారు, కానీ నిర్మాతకు కలిగిన కష్టం పట్ల బాధ పడ్డారు. కాగా జన నాయగన్ బడ్జెట్ సుమారు రూ. 350 కోట్లు ఉందని అంచనా. ఇందులో విజయ్ పారితోషికం ఒక్కటే రూ. 250 కోట్లు అని టాక్.
