శ్రీలంక : భారత జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యావత్ ప్రపంచం ఈనెల 15న ఆదివారం శ్రీలంకలో అత్యంత కీలకమైన మ్యాచ్ దాయాదుల మధ్య జరగనుంది. ఇప్పటికే టికెట్లు అన్నీ అమ్ముడు పోయాయి. ఈ సందర్బంగా పాకిస్తాన్ తో జరగబోయే మ్యాచ్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ఆడతాడా లేదా అన్న మీమాంస నెలకొంది. ఈ తరుణంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు కెప్టెన్ సూర్యా భాయ్.
సంజు సామ్సన్ ఒక క్లాస్ ప్లేయర్ అని ప్రశంసలు కురిపించాడు. అతని ఫామ్ హెచ్చుతగ్గులకు లోనవుతుందన్నది వాస్తవమేనని ఒప్పుకున్నాడు, కానీ అతని టెక్నిక్, ఆటను అర్థం చేసుకునే సామర్థ్యం సాటిలేనివని పేర్కొన్నారు సూర్య కుమార్ యాదవ్. ఇంత ప్రతిభావంతుడైన ఆటగాడిని వదిలి వేయాలని అనుకోవడం లేదన్నారు. ప్రపంచ కప్లో అతనికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. పనిగట్టుకుని గేలి చేయడం, ట్రోల్స్ చేయడం మానుకోవాలని సూచించారు. ఎంత పెద్ద క్రికెటర్ అయినా , ఎంత స్టార్ ప్లేయర్ అయినా ఫామ్ అనేది కీలకమన్నాడు. తను ఫామ్ లోకి వచ్చాక తప్పకుండా మ్యాచ్ విన్నర్ కావడం ఖాయమని అన్నాడు భారత జట్టు కెప్టెన్.
ఇదిలా ఉండగా సంజూ శాంసన్ స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన 5 టి20 సీరీస్ లో కేవలం 50 పరుగులు మాత్రమే చేశాడు. తను 10, 6, 0, 24, 6 రన్స్ మాత్రమే చేయడంతో ఫ్యాన్స్ మండిపడ్డారు. ఈ సమయంలో అభిషేక్ శర్మ గాయపడడంతో తనను టి20 వరల్డ్ కప్ లో రెండో మ్యాచ్ నమీబియాతో ఆడాడు. 8 బంతులు ఎదుర్కొని మూడు సిక్స్ లు, ఒక ఫోర్ కొట్టాడు.
