న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు లోక్ సభ సాక్షిగా ఎంపీ ఈటల రాజేందర్. ఇదే సమయంలో రైల్వే బడ్జెట్ పై ఎంపీలందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ 20 నెలలుగా అనేక సార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారిని కలిసానని, మంత్రి అశ్విని వైష్ణవ్ ఏది అడిగినా కాదన లేదన్నారు. పీఎం మోదీ భారత దేశాన్ని అగ్రదేశాల సరసన నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని, పార్టీలకి అతీతంగా ఎంపీలందరూ ప్రశంసించడమే అందుకు నిదర్శనం అన్నారు.
తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు ఈటల రాజేందర్. ఉత్తర తెలంగాణ ప్రజల 40 ఏళ్ల కల కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ.. దానిని పూర్తి చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. మనోహరాబాద్, కొత్తపల్లి రైల్వే లైన్ వేగంగా పూర్తి చేయాలని కోరారు . చర్లపల్లి రైల్వే స్టేషన్ ను 450 కోట్లు ఖర్చు చేసి పూర్తి చేశారు, నాంపల్లి , సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లను రూ.1500 కోట్లతో పూర్తి చేస్తున్నందుకు కేంద్ర సర్కార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని చేతుల మీదుగా త్వరలో వాటిని ప్రారంభించు కోబోతున్నామని వెల్లడించారు ఎంపీ.
హైదరాబాద్ నుండి పూణే, హైదరాబాద్ నుండి బెంగళూరు, హైదరాబాద్ నుండి చెన్నై మూడు స్పీడ్ రైళ్ళను మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు కేంద్రానికి. ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు 136 కిలోమీటర్ల లైన్ కు DPR కూడా పూర్తి అయ్యిందని, వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు. రామగుండం, భూపాలపల్లి, మణుగూరు కోల్ మైన్ ఏరియాలో ఉన్నట్లు తెలిపారు. కోట్ల మంది భక్తులు సమ్మక్క సారలమ్మ జాతరకు వస్తున్నారని , రామగుండం నుండి మణుగూరు కొత్త రైల్వే లైన్ వయా భూపాలపల్లి, సమ్మక్క సారక్క రైల్వే లైన్ నిర్మాణం చేయాలని కోరారు. కాజీపేట, కరీంనగర్ న్యూ రైల్వే లైన్ కోసం DPR తయారు చేయాలని కోరుతున్నామన్నారు.
మహబూబ్ నగర్, నల్లగొండ డీపీఆర్ పూర్తి అయ్యిందని నిధులు మంజూరు చేయాలని కోరారు ఎంపీ.
హైదరాబాద్, కలకత్తా పెద్ద నగరాల్లో స్పీడ్ పెరగడంతో తో ట్రాక్ క్రాస్ చేస్తూ అనేక మంది చని పోతున్నారని వాపోయారు. అన్ని రాష్ట్రాల్లో అవసరం ఉన్న ప్రతి చోట మనుషులు, స్కూటర్, కార్ల కోసం తగు ఏర్పాటు చేయాలని కోరారు. వైల్డ్ లైఫ్ ఏరియాలో కూడా ప్రమాదాల్లో జంతువులు చనిపోతున్నాయని వాపోయారు ఈటల రాజేందర్.